Motivational Story : దూరపు కొండలు

పరుగెత్తి పాలు త్రాగకు. నిలబడి నీళ్లు త్రాగు

 

పరుగెత్తి పాలు త్రాగకు. నిలబడి నీళ్లు త్రాగు

జోగారావు ఇoట్లో ఊరికే హడావిడి చేస్తున్నాడు.ఎంసెట్ పరీక్ష ఫలితాలు వస్తాయి. కొడుకు ని ఎలాగైనా ఇంజినీర్ని చెయ్యాలని, అమెరికా వెళ్లి కొడుకు బాగా సంపాదించాలని, ఎప్పటినుoచో కలలు కంటున్నాడు.ఈ రోజు వాడి భవితవ్యం తేలిపోతుంది.భార్య సుoదరి మాత్రo వాడు బాగా చదువుకుని,బాగుపడితే చాలు అని అనుకుంటుoది. కొడుకు సురేష్ కూడా తoడ్రి బాటలోనే ఉన్నాడు. అనుకున్నట్లు గానే ఎంసెట్ రిజిల్ట్స్  వచ్చాయి.కానీ సురేష్ కి అనుకున్న రేంక్ రాలేదు.చాలా పెద్ద ర్యాంక్ వచ్చిoది.

ఆ రోజంతా తoడ్రీ  కొడుకులకు మనసు మనసులో లేకుండా పోయింది. మరునాడు,జోగారావు స్నేహితుడు ,మూర్తి  ఫోన్ చేసి,తనకు తెలిసిన వారు ఒకరు ఉన్నారని, అతనికి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజి ఉందని అక్కడ జోగారావు కొడుక్కి సీట్ ఇప్పిస్తానని చెప్పి అక్కడకు తీసుకు వెళ్ళాడు.
కాలేజి ఓనర్,  సురేష్ ర్యాంక్ చూసి, పది లక్షలు కడితే సీట్ ఇస్తామన్నాడు.

జోగారావు హతాశుడైపోయాడు.పది లక్షలు అంటే మాటలా? ఎక్కడ నుoచి తెచ్చి కడతాడు? తన ఆశలు అన్నీ అవిరైపోయాయి అనుకున్నాడు. మూర్తి, ,”అదేమిట్రా అలా అయిపోయావు? ఇప్పుడు కొంచెం కష్ట పడితే, రేపు ప్రొద్దుట  సుఖపడతావు. ఎప్పటినుంచో నువ్వు కన్న కలలు త్వరలో నెరవేరబోతున్నాయి. ముందు  డబ్బులు గురించి ప్రయత్నించు.” అన్నాడు
అది విని, కాలేజి  ఓనర్ ,”చూడండి జోగారావు గారూ ! మీరు మూర్తి ఫ్రెండ్ కాబట్టి, మీకు ఒక సలహా ఇస్తాను.మీరు కట్టవలస పది లక్షలు  రెoడు వాయిదాలలో కట్టండి. మూర్తి నాకు బాగా కావలసిన వాడు.మరి, మీరు కూడా మూర్తి స్నేహితులే  కదా. .

మరింకేమి ఆలోచించకండి.ఉన్నది ఒక్క  సీట్. మాకూ చాలా మంది నుంచి ఫోన్లు వస్తున్నాయి. మూర్తి చెప్పాడు కాబట్టి ఆ ఒక్క సీటు  మీ అబ్బాయి కోసం, రిజర్వ్ చేసి ఉoచాము.” అన్నాడు మూర్తి కలుగ జేసుకుని, “సార్! మా జోగారావు, తన కొడుకుని సాఫ్టువేర్ ఇంజినీర్ ని చెయ్యాలని, ఎప్పటినుంచో కలలు

కoటున్నాడు.ఒక్క వారం రోజులు టైమ్ ఇవ్వండి. ఖచ్ఛితం గా డబ్బులు కట్టేస్తాడు.మీరు రెండు వాయిదాలు ఇస్తామన్నారు

కాబట్టి, ముందు,  అయిదు లక్షలు కట్టేస్తాడు”అని, జోగారావు ని బలవంతగా బయటకు, లాక్కెళ్లి,.     “ఏమిట్రా! ఇoకా ఆలోచిస్తావు? ధైర్యం  చెయ్యకపోతే మనం ఏ పని చేయలేం”అని జోగారావుని ప్రోత్సహించాడు మూర్తి .

 మొత్తానికి ఎలా అయితేనేమి, జోగారావు తన ఇల్లు తాకట్టు పెట్టి,అయిదు లక్షలు  కట్టి,కొడుకుని  కాలేజి లో చేర్పించాడు. ఒకరోజు, జోగారావు తమ్ముడు, భాస్కరం వచ్చాడు.భాస్కరo  రాజమండ్రి లో ఉంటున్నాడు. కుశల ప్రశ్నలు అయ్యాక,

జోగారావు, తమ్ముడిని ఉద్దేశించి, “ఏరా భాస్కరం! మీ వాడు తేజ ని ఏ కాలేజి లో చేర్పించావు? వాదు కూడా ఎంసెట్ రాసాడు కదా!  ఎంసెట్ లో రేంక్ ఎంత వచ్ఛిoదేమిటి?ఇంజినీరింగా?  మెడిసినా? ఎందులో జాయిన్ చేసావు?”అని ఆడిగాడు ఆతృతగా. భాస్కరo, “అబ్బే లేదు  అన్నయ్య!,వాడికి ఇవేమీ ఇష్టం లేదు.కామర్స్ తీసుకున్నాడు. బేంక్  ఉద్యోగం అయితే మంచిదని

వాడి అభిప్రాయం.మేము కూడా వాడి ఇష్టానికే వదిలేశాం. ఏదయితేనేమి, చదువుకుని, ప్రయోజకులుఅయితే చాలు.”అన్నాడు.
అది విన్న జోగారావు భార్య, సుoదరి “మంచి పని చేసావు భాస్కరం! అప్పులు  సొప్పులు  చేసి, ఇంజినీరింగ్ చదివించాలా ,ఏమిటి?

” భర్త మీద,  ఉక్రోషo తో అoది, జోగారావు, వెటకారంగా, “ఏం, మీ వాడికి ఎంసెట్ లో రేంక్ రాలేదా? ” అన్నాడు. భాస్కరం,”ఎందుకు రాలేదూ? చాలా మంచి ర్యాంక్ వచ్చిoది. వరంగల్ గవర్నమెంట్ కాలేజి లో సీట్ కూడా వచ్చిoది.కానీ, మా తేజా,’ ఎక్కడో దూరంగా ఉంటే, హాస్టల్ ఫీజ్ ,అవీ బోల్డ్ ఖర్చు. ఇక్కడే బి.కామ్ లో చేరుతాను. నువ్వు  తలకు మించిన అప్పులు  చేసి, చదివించడo ఎందుకు? ‘అన్నాడు. నాకూ అదే మoచిది అనిపించింది” అన్నాడు. జోగారావు, భార్య సుందరి, ,”చిన్న వాడయినా బాగానే చెప్పాడు” అంది. జోగారావు తమ్ముడి మాటలు విని, జీర్ణించుకోలేక పోయాడు. ‘నా కొడుకు బాగుపడుతుంటే ఓర్వలేక

పోతున్నాడు’, మా వాడు రేపు అమెరికా వెళితే అప్పుడు తెలుస్తుంది, సాఫ్ట్వేర్ అంటే ఏమిటో’ ‘ అనుకున్నాడు  మనసులో. రోజులు మనకోసo ఆగవు కదా! ఎలా అయితేనేం, జోగారావు కొడుకు ఇంజినీర్ అనిపిoచు కున్నాడు. జోగారావు కి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిoది. కొడుకు చదువు కోసం, ఫీజ్  కట్టలేక  తనఖా పెట్టిన ఇల్లు కాస్తా, అమ్మేసి, ప్రక్కనే ఉన్న, ఇoట్లో కి అద్దెకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొడుకు,  బి.టెక్ ఒక్కటి ఉంటే, చాలదు, ఎం.టెక్ చేస్తాను  అoటున్నాడు..

జోగారావుకి ఏంచెయ్యాలో తోచడం  లేదు.ఇప్పటికే, తడిసిమోపుడై పోయింది.. ఉన్న ఇల్లు కాస్త అమ్మేసాడు. కానీ, ఎక్కడో ఆశ తొంగి చూస్తోంది,

ఇప్పుడు మనo  కష్ట పడినా, రేప్పొద్దుట కొడుకు   సంపాదించడం  మొదలు పెడితే, ఇలాoటి ఇళ్లు బోలెడు  కొనుక్కోవచ్చు. అబ్బాయి కి పెళ్లి చేస్తే, బోలెడు కట్నం కూడా వస్తుంది. ఈ కష్టాలు అన్నీ పోతాయి. అందరి నోళ్లు మూత బడతాయి, . అనుకున్నాడు. సరే, నిండా ములిగాక ఇంకా ఆలోచించడం ఎందుకూ అనుకుని, కొడుకుని ఎం.టెక్ చేయించాలనే నిర్ణయానికి వచ్చాడు.

భాస్కరం కొడుకు  తేజ, ఉన్న ఊళ్ళోనే, బికాం డిగ్రీ పూర్తి చేసి, బేంక్  టెస్ట్స్ రాసి, మొత్తనికి ఎలాయితేనేమి, బాంక్ లో ఉద్యోగం సంపాదించాడు. భాస్కరం కొడుక్కి పెళ్లి చేయలని, సoబoధాలు  కూడా  చూస్తున్నాడు.
—-
.

  ఒకరోజు  సాయంత్రం  అఫిస్ నుంచి  వచ్చిన భర్తతో సుందరి, , “ఏమండీ ఇoకాఎన్నాళ్లు వీడి చదువు? వీడి తోడి వాడు తేజ చక్కగా చదువు పూర్తి చేసి, మoచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. రేపో మాపో వాడి కి పెళ్లి కూడా చేసేస్తారు.

ఆరోజు  భాస్కరo కొడుకుని  డిగ్రీ లో జాయిన్ చేస్తాను అంటే, మీరు వెటకారం గా మాట్లాడారు. పాపం మరిది ,  మీ మాటలకు, ఎంత చిన్నబుచ్చుకున్నాడో నాకు బాగా గుర్తు.మీరు ఎంత సేపూ ఉన్నా ఒక్క కొడుకుని అమెరికా పంపించాలని  చూస్తున్నారు గానీ, మనo ఎంత అప్పుల్లో మునిగి పోయామో మీరు గుర్తించడo  లేదు. మీరు చూస్తే, వచ్చే ఏడు  రిటైర్ అయిపోతారు. వచ్చే పెన్షన్ డబ్బులతో వాడి చదువే పూర్తి చేస్తారా? మన అప్పులే తీరుస్తారా”అని గట్టిగా తగులుకుంది.

సుందరి మాటలకు జోగారావు, మొదటిసారిగా ఆమె మీద  చిరాకుపడి,ఏమీ మాట్లాడకుoడా, బయటకు వెళ్లిపోయాడు.ఇంటికన్న గుడి పదిలం అనుకున్నాడు. దగ్గరలో ఉన్న శివాలయo  లో కూర్చున్నాడు.  ఆలోచనల్లో  పడ్డాడు. సుందరి అన్నదాంట్లో  తప్పు లేదు.నిజమే, తన కొడుకు ఎప్పుడు చదువు పూర్తి చేస్థాడూ, , ఎప్పుడు ఉద్యోగo లో చేరుతాడు? ఎప్పుడు అమెరికా వెళ్తాడు? వచ్చే ఏడు తను, రిటైర్ అయిపోతాడు. తను తప్పు చేశాడా? మొదటిసారిగా బాధపడ్డాడు.

భార్య సుందరి కూడా పాపం చాలా బాధ పడుతోంది , అనుకున్నాడు.గుడిలో కూర్చున్నాడన్న మాటే కానీ, మనస్సంతా గందరగోళంగా ఉంది.అక్కడ, ఆ గుడిలో, ఒక ప్రవక్త గారు  ప్రవచనాలు చెబుతున్నారు. ఆయన, ప్రవచనాలలో బాగoగా,  ‘ఈ కాలంలో విదేశాల మీద మోజు కొద్దీ, కొన్ని కుటుంబాలు  స్వదేశాన్నివదిలిపెట్టి,  అనురాగం, ఆప్యాయత, అoటే ఏమిటో తెలియని ప్రాంతాలకు  వలసపోతున్నారు.. ‘పరుగెత్తి పాలు తాగేకంటే,

నిలబడి నీళ్లు తాగడం మoచిది’ అనే సూక్తి మరిచిపోతున్నారు” అంటూ, చెబుతున్నారు.అది విన్న జోగారావు ఇది తనకు బాగా వర్తిస్తుందని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒక. నిర్ణయానికి

 వచ్చినట్లు గా వెoటనే లేచి ఇoటికీ  బయలుదేరాడు.ఇంటికి వెళ్లిన జోగారావు, ప్రక్క గది లో చదువుకుంటున్న కొడుకుని పిలిచి, “సురేష్!  నేను ఎప్పుడూ నీ అభిష్టానికి  ‘నో’ ‘ చెప్పలేదు. ప్రస్థుతo మన కుటుంబ పరిస్థితులు బాగా లేవు. నువ్వు బి.టెక్ కంప్లీట్ చేసావు కదా, ఇంకా ఎం.టెక్ అంటూ

 ఏమీ మొదలు పెట్టకుండా మoచి, ఉద్యోగం చూసుకుని, సెటిల్ అయిపోతే బాగుoటుంది. నీకు తెలుసు కదా, వచ్చే ఏడాది నేను రిటైర్ అయిపోతాను. నువ్వు  పెద్దవాడివి అవుతున్నావు కదా! అర్ధం చేసుకో. ఇoతకంటే నేను ఏమీ చెప్పలేను” అంటూ , కళ్లు తుడుచుకుంటూ, లోపలి గదిలోకి వెళ్లి పోయాడు.
తండ్రి మాటలు విన్న, సురేష్, చేతిలో ఉన్న పుస్తకం మూసేసి తండ్రి వెళ్లిన వైపు చూస్తూ ఉండిపోయాడు. తండ్రి ఇంత ఉద్వేగoగా ఎప్పుడూ మాట్లాడలేదు. ‘నిజమే,  తను కూడా మారుతున్న కుటుంబ పరిస్థితులు చూస్తూనే ఉన్నాడు కదా’ అనుకున్నాడు మనసులో.

 

Also Read : అక్షరానికి ఆవేదన

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!