Motivational Life : జీవిత అంకాలు
జీవిత అంకాలు
జీవిత అంకాలు
ఎన్నో దశలు దాటి ముందుకు సాగాలి
ఎన్నెన్నో సమస్యలకు పరిష్కారం వెతకాలి
ఏదో ఒకటి సాధించి ఎదుటివారికి చూపించాలి
ఏది ఏమైనా సత్యం విలువ కనుగొనాలి
ప్రయత్నం మనది అని గర్వించకూడదు
ప్రయాసకు భయపడి పని వీడకూడదు
ప్రేరణగా నిలిచిన మనిషిని మరువకూడదు
ప్రదాన దైవమైన ఆ శివుడిని తలవక ఉండకూడదు
నిన్ను నువ్వు నమ్ముకునే క్రమంలో పయనిస్తూ
నీ కోసమే నువ్వు నడక మొదలుపెట్టు ప్రయత్నిస్తూ
నిదానంగానే అయినా గమ్యాన్ని చేర యత్నిస్తూ
నీకు సుందరమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తూ
అదే విజయాన్ని జీవితానికి అర్ధంగా భావించవచ్చు
అడుగు జాడల్లో నడువ వలసిన సమయం అవ్వచ్చు
ఆ సమయాన్ని, కాల యాపనతో వృధా చేయవచ్చు
నీ విజయం కై కోరిన అపురూప కోరిక నెరవేరవచ్చు.
Also Read : అలౌకిక మహా విభూతి