మాతృభూమి
మానవత్వపు పరిమళం మా కొసగిన మాతృభూమికి వందనం
శాంతి సహనం ప్రేమ ఓరిమి విత్తులుగా నాటిన నేల తల్లికి వందనం
జ్ఞాన మూలాలు వేదాల సారాలు సనాతనధర్మాలు సాంప్రదాయాలు
కలబోసిన జ్ఞాన గంగా ప్రవాహా లు విజ్ఞాన తరంగాలు గా ఎగసి
నా కందించిన నా మాతృభూమికి సప్రేమ వందనం అభివందనం .
ఉపనిషత్తుల సారం రామాయణ మహాభారత ఇతిహాసాలె మూలాలుగా
సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అంధించిన భగవద్గీతే దిక్సూచిగా
సమగ్ర జ్ఞాన సముపార్జన కై భాగవత అష్టాదశ పురాణాల మార్గదర్శి గా
పురాతన గ్రంధాలు, , అన్నమయ్య సంకీర్తనలు , పురందర దాసు కీర్తనలు,
మహా ఆథ్యాత్మిక పీఠాలు, కొలువై నెలవై వున్న నా మాతృభూమికి వందనం.
మాతృభూమి సేవలో పునీతమయిన త్యాగమూర్తులెందరో ఈ తల్లి బిడ్డలు
అల్లూరి పరాక్రమం ,శివాజీ ధైర్యం, రుద్రమదేవి శౌర్యం , మహాత్ముని సత్యాగ్రహం
పటేల్ ఏకతా సాధనం, భరతమాత సేవలో పునీతమయిన ఎందరో మహనీయుల
వీరివారసులుగా వీరి గాధలు ఆదర్శంగా మాతృభూమి రక్షణలో భాద్యత వహిస్తూ
కాపాడుకుంటూ సేవలో తరిస్తూ మాతృభూమి పై తుదిశ్వాస తృప్తి గా వదలాలి.
Also Read : స్వర్గసీమ