Motherland : మాతృభూమి
మాతృభూమి
ప్రణమిల్లి
నింగినుండి ముత్యాల్లాంటి చినుకులు నేలజారడమే చూసాను ఇంతవరకూ ,
కానీ,శత్రు సైనికులు నేల విడిచే రాకెట్స్, బుల్లెట్టు చూడడం అదే తొలిసారి నాకు
నేలపై సంచరించే విష సర్పాలను మాత్రమే చూస్తూ పెరిగిన నాకు ,రక్తదాహంతో విచక్షణా రహితంగా
ప్రాణాలను హరించేందుకు
సిద్దమౌతున్న కుటిల చతురత కల్గిన శత్రుమూకలను చూడడం
ఇదే తొలిసారి నాకు.
ఎదురుగా పోరాడలేక,చాటు మాటుగా దెబ్బ తీసిన
వాలి సుగ్రీవుల కథ చదువుకున్న నాకు.
యుద్ధరంగంలో దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్న
శత్రుదేశ సైనుకులను చూడడమే ఇదే తొలిసారి నాకు
మానవత్వంతో శత్రువుకు సైతం వైద్య సేవలు అందిస్తూ
తన వారిని అప్రమత్తం చేస్తున్న నాదేశ స్త్రీ మూర్తిని చూస్తున్నది కూడా ఇప్పుడే.
దేశం కోసం ప్రతి క్షణం తపిస్తూ,
నిత్యం సరిహద్దుల్లో ప్రహారా కాస్తూ,దేశ రక్షణే కర్తవ్యంగా,ముందుకు సాగుతున్న
నా దేశపు యువతను చూస్తున్నది కూడా ఇప్పుడే.
తెగిపడుతున్న దేహాలను, దాటుకుని
రక్తసిక్తమైన శరీరంతో,ప్రాణ భయం అంటే ఎరుగని
నా దేశసైనికుల వీరత్వం చూస్తున్నది కూడా ఇప్పుడే.
మాతృభూమి కోసం యుద్ధరంగంలో
మన సైనికుల త్యాగనిరతిని చూస్తూ
వారిలోని కార్యదీక్షకు ప్రణమిల్లుతున్నా
జై! జైవాన్ అంటూ నినదిస్తున్నా.
Also Read : నా భాష