అమ్మ భాష
అందనంత ఎత్తులోన
నక్షత్రంలా ప్రకాశిస్తూ
వసంతకాలపు వేళలోన కోయిల సరాగం తానై
మాధుర్యమైన మాతృభాష
మనసు పులకరించిన వేళ అందమై ఆనందంలో తానై
తరలి తరలి వచ్చే భాష అమ్మ భాష
అమ్మ అనే పిలుపులోన కమ్మనైన మాధుర్యం తానై
ఆనందపు కేరింతలు తానై
ఊహల్లో విహరించు కవి కలానికి
దొరికిన కమ్మనైన భాష
ప్రసవ వేదనలోన తల్లి రోదనలోన ఆక్రందన తానై
పసిపాపల బోసి నవ్వులలోన భావ ప్రకటన తానై
రగిలే ఆక్రందనలోన సాగర ఘోష తానై
అన్నింటతానై ఉన్నా
నేటి సామాజిక పరిస్థితుల్లో ఎడారిలో ఎండమావిగా
కనిపించి కనిపించక మాయమవుతున్నది మాతృభాష
Also Read : అజరామర నా మాతృభూమి