Most Inspiring Movie Artist : మిమ్మల్ని ప్రభావితం చేసిన సినీ నటుడు/నటి

మిమ్మల్ని ప్రభావితం చేసిన సినీ నటుడు/నటి

 

గంభీరమైన రూపం,నిలువెత్తు విగ్రహం, అది యెస్,వి,రంగారావు. సామర్ల కోట వెంటక రంగారావు యస్.వి. రంగారావుగా సుప్రసిద్దులు.

మన తెలుగు రాష్ట్రంలోనిది  అయిన కృష్ణాజిల్లాలోని నూజివీడులో 1918 జులై 3 వ తేదీన తెలగనాయుళ్ళ వంశములో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు రంగారావు.

రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిశ్చనిపునిడుగా పనిచేశారు. బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడురంగరావుకి మేనమామ.

తండ్రి న్యాయ శాస్త్రవేత్త అయినప్పటికి,ఎక్సైజు శాఖలో పనిచేస్తూ వృత్తి రీత్యా పలు ప్రాంతాలలో బదిలీలు అవుతుండటం వలన నాయనమ్మ అయిన గంగారత్నమ్మ పర్యవేక్షణలో పెరిగాడు. తాత మరణానంతరం తండ్రి ఉన్న చోట నాయనమ్మతో సహా మద్రాసుకు వచ్చారు. రంగారావు  అక్కడే ఆయన విద్యాభ్యాసం సాగించారు.

మద్రాసు హిందూ ఉన్నత పాఠశాల లో మొదటి సారిగా నాటకంలో నటించారు తన పదిహేనవ ఏట. ఆయన నటనను అందరూ ఎంతో గొప్పగా కొనియాడేసరికిఆయనకు నటుడిని అవ్వాలనేకొరికకు బీజం పడింది. అప్పటి నుంచి పాఠశాలలో ఏ నాటకం అయినా నటించేవాడు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడలతో పాటూ వక్తృత్వ పోటీల్లోనూ పాల్గొనేవారు.

మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరవుతూ ఉండేవారు. అన్నీ భాషల సినిమాలు చూసి విశ్లేషించేవారు. రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం 1934లో విడుదలైన లవకుశ.

ఏలూరులో ఉన్న మేనమామ మరణించటంతో తిరిగి కూతురికి తోడుగాఉండాలనే ఉద్దేశ్యంతో రంగరావునుతో సహా ఏలూరు వచ్చి చేరారునయనమ్మతో పాటు. వారి కుటుంబంలో ఎవరు నటులు లేని కారణంగా రంగారావు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలన్నదే ఆ కుటుంబ సభ్యుల కోరిక కానీ రంగారావుకు నటుడుగా ఎదగాలనే ఆశను వదులుకోలేక చదువుకుంటూనే కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో నటించారు. అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఎ.సుబ్బారావు, రేలంగి వంటి వారితో అక్కడే ఆయనకు పరిచయం ఏర్పడింది.

నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పీష్వా నారాయణరావు వధ నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ

వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. షేక్స్‌పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలను ఇంగ్లీషు మీది మంచి పట్టు ఉండటంలో పోషించి మెప్పును పొందారు.

ఓ వైపు నాటకాలు వేస్తూనే బి.యస్.సి. పూర్తి చేశారు. యమ్.యస్.సి. చేయాలనుకున్నారు కానీ అగ్నిమాపక దళం లో ఉద్యోగం రావడంతో బందరులో ఫైర్ ఆఫీసర్ గా పనిలో చేరారు. ఉద్యోగ రీత్యా నటనకు దూరం అవుతున్నాను అన్న ఆలోచనతో ఆయన ఆ ఉద్యోగం నుంచి బయటికి వచ్చేశారు చాలా కొద్ది రోజులకే.

బి.వి రామానందం రంగారావుకు దూరపు బంధువు. ఆయన దర్శకత్వంలో ‘వరూధిని’ అన్న సినిమాలో ప్రవరాఖ్యుడి పాత్రలో నటించారు మొట్టమొదటిసారిగా సినిమాలో.

నటి గిరిజ తల్లి దాసరి తిలకం ఆయనకు జోడీగా నటించింది. 750 రూపాయలు పారిషోతికంతీసుకున్నారట మొదటగా ఆయన. ఆ సినిమా సరిగా ఆడినందున రంగరావుకు తిరిగి సినిమా అవకాశాలు రాక మళ్ళీ ఉద్యోగం లో చేరారు.

తరువాత కొంత కాలానికి పల్లెటూరి పిల్ల సినిమాలో ప్రతినాయకుడి పాత్రకై పిలుపు వచ్చింది కానీ తండ్రి మరణంతో ఆ అవకాశం అందుకోలేకపోయారు.

‘మనదేశం’,‘తిరుగుబాటు’ చిత్రాలలో కూడా అంతగా ప్రదాన్యత లేని పాత్రలు దక్కాయి. అయినా నిరుత్సాహ పడకుండా రంగారావు మంచి పాత్రలకై ఎదురు చూశారు.

నాగిరెడ్డి, చక్రపాణి కలిసి ‘విజయ ప్రొడక్షన్స్’ అనే సంస్థను స్థాపించి తొలిసారిగా నిర్మించే ‘షావుకారు’ సినిమాలో రంగడి పాత్రను రంగారావుకు ఇచ్చారు. ఇక తిరిగి చూసుకోలేదు. అక్కడి నుండి ఆయన విజయం మొదలయింది అని చెప్పొచ్చు.

అదే సంస్థ నిర్మించిన ‘పాతాళభైరవి’ సినిమాలో మాంత్రికుడి పాత్ర ద్వారా ఆయన తన పేరును చిత్రసీమలో సుస్థిరం చేసుకున్నారు.

‘పెళ్లి చేసి చూడు’ చిత్రం తెలుగులోనూ, తమిళంలోనూ ఆయనే నటించారు. తెలుగు తమిళమే కాక ‘పాతాళభైరవి’ హిందీలో తీసే చిత్రంలోను ఆయనే మాంత్రికుడి పాత్ర పోషించి హింది భాషలో పట్టు ఉండటం మూలంగా డబ్బింగ్ కూడా ఆయనే చెప్పుకున్నారు. ‘భూకైలాస్’‘మాయబజార్’ వంటి పౌరాణిక చిత్రాలలోనూ నటించి ఔరా! అనిపించుకున్నారు.

నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతను్ను గౌరవించారు. ‘నర్తనశాల’ చిత్రంలో కీచకుడి పాత్రలో ఆయన చూపిన ప్రతిభకు ఇండోనేషియా ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవంలో భారత దేశం యొక్క తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా భాహుమతిని గెలుచుకున్నారు. అదే పాత్రకు రాష్టపతి అవార్డ్ కూడా అందుకున్నారు.

వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. సినిమా సెట్ మీద గాంభీర్యంగా ఉండేవారు. వ్యక్తిగత విషయాలు అందరితో చర్చించటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఆయన శివుడిని ఆరాధించేవారు. రంగరావుకు ఇద్దరు కుమార్తెలు విజయ, ప్రమీల, ఒక కుమారుడు కోటేశ్వరరావు.

యస్.వి.రంగారావు వేదాంత దొరణిలో ఉండేవారు. వివేకానందుని పుస్తకాలు చదువుతూ ఉండేవారు. ఆయన రచయిత కూడా. మనసుకు తోచింది ఆయన రాసుకుంటూ ఉండేవారు.

రంగారావు ప్రాణహిత సంస్థకు ఎన్నో విరాళాలు ఇచ్చారు. ఎవరైనా సహాయం కావాలని వస్తే లేదు అనకుండా దానం చేసేవారు. ఆయనకు కుక్కలపై మక్కువ. అందుకే ఆయన తన ఇంట్లో జర్మన్షెఫర్డ్ జాతి కుక్కలను పెంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్నీ జిల్లాలలోనూ ఆయనకు సన్మానాలు జరిగాయి. జకార్తాలో అవార్డును అందుకుని వచ్చిన తరువాత మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాలవారు ఆయనను ఘనంగా సత్కరించారు.

విశ్వనటచక్రవర్తి,నటసార్వభౌమ,నటసింహ,నటశేఖర అన్న బిరుదులు ఆయనను వరించాయి. గుమ్మడి ఆయనను ‘ఇక్కడ పుట్టవలసిన వారు కాదు, విదేశాల్లో అయితే అంతర్జాతీయ అయిదుగురు ఉత్తమ నటుల్లో ఒగరుగా ఉండేవారు’ అనేవారు.

2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయినతపాళాబిళ్ళలలో ఒకటి ఎస్వీ రంగారావు మీద విడుదలయింది.

ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలుకలబోసినసహజ నటుడు రంగారావు.

యముడిగా,మాయలఫకీరుగా, మాంత్రికుడిగా,ఘటోత్కచుడిగా, పౌరాణిక జానపద పత్రాల్లో, సామాజిక, సాంఘిక పాత్రల్లోనూ… ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి జీవించేవారు రంగారావు. ఆయన  కళ్ళు, కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగామలచేవారు.

నటులే కాదా ఆయన కథలు కూడా రాసేవారు. ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి.

ఈ మధ్యకాలంలోనే‘రంగారావు కథల పుస్తకం’ వెలువడింది.

యశోద కృష్ణ చిత్రం తరువాత ఆయన గుండెపోటుకు గురై 1974 జులై 18 వ తేదీన తుదిశ్వాస విడిచారు.

విలక్షణమైన నటనకు ఆయన పెట్టింది పేరు. 018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఆ తరం నటులు అయినా ఈనాటికి మరచిపోలేని మహోన్నతమైన వ్యక్తి, నటులు    శ్రీ. యస్,వి,రంగారావుగారు.

నా హృదయాంజలి నివాళులతో…

 

Also Read : తెలుగు వాగ్గేయకారుడు

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!