గుణపాఠం
పూర్వం మా ఊరిలో ఒక చర్చి పాదిరి ఉండేవాడు. ఆయనకు పెళ్లి కాకపోయేసరికి, ఆయనకు చిన్న పిల్లలన్న, జంతువులన్న చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంట్లో చాల రకాల జంతువుల్ని పెంచుకొనే వాడు. ముఖ్యంగా పిల్లులు, కుక్కలు, పక్షులు ఇలా చాలా రకాలు ఉండేవి.
ఆ ఊరిలో పిల్లలకు ఆ పాదిరి ఇంటికి వెళ్ళి ఈ జంతువుల్ని చూస్తూ, వాటితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టపడేవారు. అలా ఆయన పెంచుకొనే జంతువులలో, డాలి అనే కుక్క ఒకటి ఉండేది. చూడటానికి భయంకరంగా కనిపించినా,! చాలా మృదు స్వభావి. అందుకే పిల్లలకి డాలి అంటే చాలా ఇష్టం.
ఎవరైన కొత్తవారు పాదిరిని కలవడానికి వస్తే, దాని అరుపుతోనే, ఎవరో వచ్చారని గుర్తుపట్టి బయటకు వచ్చే వాడు.అలా వచ్చిన వారికి స్వాగతం పలకడం, ఎవరైనా తల నిమిరితే వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటి పనులు చేసి అందరి మన్ననలు పొందేది.
ఒకరోజు ఎవరి పనుల్లో వ్యయాలు ఉండగా, డాలి గొలుసు పట్టుతప్పి పాదిరి ఇంటి నుండి బయటకు పరుగెత్తి ఊరి కుక్కలతో తిరిగి, సరిగ్గా పాదిరి వచ్చే సమయానికి డాలి ఇంటికి వచ్చి, బుద్దిగా కూర్చుంది. పాదిరికి మాత్రం గొలుసు పట్టుతప్పినా, ఎంతో విశ్వాసంతో ఇంటిపట్టునే ఉందని ఎంతో మురిసిపోయాడు.
ఇలా రోజులు గడుస్తున్నాయి.రోజు గొలుసు విడిపించుకొని బయటకు వెళ్ళిరావడం ఆనవాయితీ అయ్యింది. అయినా డాలి ఇంటి పట్టు పట్టునే ఉంటుంది అని ఇక డాలిని కూడా కట్టేయడం కూడా మానేసి పాదిరి ఇంటి ఆవరణంలోనే స్వేచ్ఛగా తిరగనిచ్చే వారు. ఈ లోగా డాలి ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది.
పిల్లలతో ఆడుకోవడం తగ్గించింది. రాత్రి సమయాల్లో కావలీ కాయకుండా పడుకొనేది. పాదిరిని కలవడాని ఇంటికి వచ్చిన కొత్తవారి మీద దూకి కరిచేంత పనిచేసేది. ఎవరైనా తలమీద చేయీ పెడితే వారి చేయి అందుకోడానికి ప్రయత్నంచేసేది. ఈ పద్దతి పాదిరిని దిగ్బ్రాంతికి గురి చేసి, ఏదో జరుగుతుందని అర్ధంఅయ్యింది పాదిరికి.
ఒకరోజు ఊరిలో కుక్కల బెడద ఎక్కువయ్యిందని, ఊళ్ళో కుక్కలని పట్టుకోవాలని నిర్ణయించింది గ్రామ పంచాయితి. ఆ వార్త తన డాలి కొరకు కాదులే అనుకొని తన పని కోసం తాను వెళ్ళి పోయాడు పాదిరి. రోజులాగే పాదిరి బయలుదేరి వెళ్ళిన మరుక్షణమే గోడ దూకి డాలి తన పని తాను చేసుకుపోయింది.
ఊరి కుక్కల కోసం గ్రామపంచాయితీ వారు పన్నిన వలలో, డాలి కూడా చిక్కింది. మరుక్షణమే మున్సిపల్ బండిలో ఎక్కించడంతో బెదిరిపోయిన డాలికి, కొత్తకుక్కల అరుపులతో, కరుపులతో స్వాగతం స్వాగతం పలికాయి.
ఎక్కడో మూలాన నక్కిన డాలికి, కనబడే ముఖాలు మొత్తం కొత్తగానే కనబడ్డాయి, ఎంత వెదికినా తనతో రోజు బయట తిరిగిన స్నేహితులు ఎవ్వరూ కనబడక పోయేసరికి వాటికి ఉన్న యుక్తి తనకిలేదని అర్ధం అయ్యింది.
దీంతో డాలి తాను తప్పు చేశానని, పాదరిని ఇచ్చిన స్వేచ్చని దుర్వినియోగం చేస్తూ ఆయనను రోజు మోసం చేయడం వల్ల తనకు ఈ దుస్థితి కలిగిందని తనలో తాను పశ్చాతాపపడుతూ, పాదరిని క్షమించమని వేడుకొంది.
అలా తన జీవితం మీద ఆశ కోల్పోయిన డాలికి ఎక్కడో పాదిరి గొంతు వినబడేసరికి, బ్రతుకుమీద ఆశ కలిగింది. ఈలోగా మున్సిపల్ వాళ్ళని బ్రతిమిలాడి, తన పెంపుడు కుక్క డాలికి విముక్తి కలిగించి, ఇంటికి తీసుకొని రాగానే కొత్తగోలుసును డాలి మెడకు బిగించాడు పాదిరి.
ఆనాటినుండి డాలి ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని, తిన్న గుణపాఠానికి, ఇంటికివచ్చిన వాళ్ళతో మర్యాదగా నడుచుకుంటూ, పాదిరిపట్ల కృతజ్ఞతో బ్రతుకుతూ, “ఎవడి నెత్తి మీద వాడే చెయ్యి పెట్టుకున్నట్లు” అనే సామెతను గుర్తుచేసుకుంటూ గోలుసుతో కట్టివేయకుండా మరిచిపోయినా, బయటకి వెళ్ళడానికి ఏనాడు సాహసం చేయలేదు డాలి.
Also Read : అనుభవంతో నేర్చుకున్న ఒక గుణపాఠం