తెలుగు వెలుగు
ఒలికే మల్లియలా
చిలికే మజ్జిగలా
కులికే కోయిలా
మొలిచే మొక్కలా
కమ్మని కల లా
ఊగే ఊయలలా
సాగే సరాగంలా
పారే జలపాతంలా
పలుకు తేనియలు
తెలుగు వెల్లువలు
వెలుగు వేకువలు
మధుర మూలికలు
సుధలకు తెలియని మధురిమలు
అలుగు పారుతున్న తెలుగు వెలుగు
తులతూగుతున్న తెలుగు ధనము
ఇది తెలుగు జలపాతం
కవన హిమపాతం
తొలగు కఠినత్వం
తెలుగు విల్లు సంధించిన ఓనమాలు బాణాల
వెన్నెల జల్లు కురిపించిన చందమామ కిరణాలు
భాషల బాటసారుల బహుమానమే తెలుగు
భావాల కదిలించే కొలమానము తెలుగు
మమతల కోవెల్లో కొలువైన మన తెలుగు
మధుమాసపు పెళ్ళిలో పేరంటం తెలుగు
వలపుల వాకిట్లో సిగ్గు ముగ్గు ఈ తెలుగు
పొలముల కౌగిట ఒదిగిన ధాన్యపుసిరులు
ప్రేమల పెదవిపై పదాల మధువులు
ఓనమాల బడిలో చెదరని చిరునవ్వుల చదువులు మన తెలుగు వెలుగులో
Also Read : ఆశయ కోవెలకై మొదటి అడుగు వేస్తున్న