వెన్నెల వెలుగు
స్వచ్ఛమైన భావములు
పాలనురగవలే సంద్రతీరమోలే
పసిపాప నిర్మల నవ్వుల తీరువోలే
లతవల్లికలు వృక్షవాటికలకు చుట్టుకొన్న
విరిగుచ్చముల సౌరభ సౌరువోలె
మన తెలుగు మనుసునుప్పొంగును
మాట మాటను పొదిగిన మణిహారమై
ముత్యాల హారములై మృదు భాషణమై
యాబైయారక్షరాల సొగసులై పలుకును
మన తెలుగు వెన్నెల వెలుగై కురియును
జిహ్వపై పంచదారలు చల్లిన రీతిగ
అన్య భాషలకు లేని యందములు చిందుతూ
పద్యగేయ రూపమై పలుకాడునోయి
పామరుని నోట పసిపాప పవ్వళించిన రీతిగా
ఆంధ్రుల భాష అమృతమై తాగిన ఆంగ్లేయులు
ఇటాలియన్ భాషగా కీర్తించకమునుపే
కన్నడరాయల కలముదీరెను కదా
దేశభాషలందు తెలుగు లెస్సయని
ప్రాచీనాంధ్రకవుల పాద పద్మములకు నేపాటగా పద్యముఖముగా
నోరార కొలిచెదా పిలిచెదా పలికెదా
నా తల్లిభాష తెలుగు దేశాన తెలుగు యెదననాటిన
తొలి తేటమాటల తోటమాలులని
అనురాగ ముప్పొంగంగ ఆప్యాయతలు విప్పుకొనంగ
తల్లిపాల అనుబంధం తెలియజెప్పంగా
నా యెదనిండా పొంగే స్వచ్ఛమైస పావన సురగంగ నా తెలుగు భాష
మోడు బారిన వృక్షకౌగిలికి ఆమని మన తెలుగు
వసంత మాసములో తరువులకు చుట్టిన
విశాల విరిసొగుసుల పచ్చని చీరకొంగు
ఉగాది షడ్రుచుల మేళవింపుతో
భిన్నరుచి ఘుమాళింపు మన తెలుగు
విను సొంపైన వీనుల విందైన పసందైన
కమ్మని కోయిల సుస్వరాలే మన తెలుగు
అమ్మ ఒడిలో ఆత్మస్థైర్యంతో చంటిబిడ్డలు
కరయుగ్మపు కదిలికలే మన తెలుగు
తిక్కన పోతన ఎర్రన వేమన రాసిన
నన్నయ పెద్దన సోమన శ్రీనాథ చేతిచలువయే మన తెలుగు
Also Read : మన తెలుగు