Meaningful : సార్ధకం

సార్ధకం

సార్ధకం

తూరుపు దిక్కున ప్రభవించే ప్రభాతానికి సైతం
పొద్దుపోయాక తప్పదు అస్తమయం,
ఆ జీవన సమరం, నిరంతర కాల ప్రవాహం

జననం రోదనతో ఆరంభమై,
మరణం శోకాన్ని మిగిల్చే
విధి ఆడించే విచిత్ర నాటకం జీవితం

ఆ జీవన సమరంలో, తగులుకున్న బంధాలెన్నో
తెగిపడిన అనుబంధాలు ఎన్నెన్నో

బతుకు లాటకు ముగింపు
అనివార్యం అని తెలిసినా,
శాశ్వతమనే భ్రమల్లో,
పోగేసుకోవాలనే తాపత్రయం వీడక,
సతమతమవ్వడమే, జీవన సమరం

సమరం ముగిసినా,చిరస్థాయిగా
జగతిలో, జనాల మదిలో
నిలిచిపోవడం ఎందరికి సాధ్యం?
అది పొందినవాడి జన్మేగా సార్ధకం!

 

Also Read :  శూన్యం

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!