నేను సైతం
నేను సైతం సమిధనైతే ఉజ్వలించద కాంతి పుంజం
నేను సైతం ఉజ్వలిస్తే గెలుపు కాదా నా స్వంతం
నేను సైతం గెలుపునైతే ఓటమికే మరి బానిసత్వం
నేను సైతం ఓటమైతే గెలుపు కోసం ఇదో పద్యం
ఆకురాల్చే కొమ్మ సైతం కొత్త చిగురును పూయదా
చిన్నగుండే చీమ సైతం పెద్ద బరువును మోయదా
అగ్నిశిఖలుగ దూకు లావా నీ గుండె మాటున దాచినావా
తాడోపేడో తేల్చు త్రోవ చూపుటకు నువు కదలిరావా
నేను సైతం అంటు కదులు విప్లవానికి అదే మొదలు
పిరికి మూటల కుండ పగులు పరుగునొచ్చి గెలుపు తగులు
Also Read : కలంతో గళం