పరిణయం
జీవితం పట్ల ఎన్నో కలలు కంటున్న
నా ఊహల ప్రపంచంలోకి అందమైన మనసున్న,
అద్భుతమైన బాపు బొమ్మలా వచ్చావు.
నీ పరిచయం నా గమ్యాన్ని చేరుకునేలా చేసింది.
నీ స్నేహం ప్రేమగా మారి పరిణయమునకు
దారి చూపింది. నేను కడుతున్న ఈ
మూడుముళ్ల సాక్షిగా చెబుతున్నాను.
నా జీవిత భాగస్వామి గా వచ్చిన నీతో
ఏ నాడు కష్టపడకుండా చూసుకుంటానని,
మన దాంపత్యం జీవితాంతం బాగుండాలని
ఇష్టపూర్వకంగా ని మెడలో ఈ
తాళి కడుతున్నాను
Also Read : నిధి