Mana Telugu : మన తెలుగు
మన తెలుగు
మన తెలుగు
వెలుగుజిలుగులు విరజిమ్ము దివ్య భాష!
భవ్యమైన భాష మన తెలుగుభాష!
లేదుగా దీనికి సరి సాటి,
భాషలన్నిటికిదే మేటి!
అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స!
అల్లసాని అల్లికలు
అన్నమయ్య అద్భుత కీర్తనలు
అష్టదిగ్గజాల అష్టావధానాలు
పోతనా మాత్యుని భక్తి రస రాగాలు
పొగడ తెలుగును చాలవుగా
భాషలో విశేషణాలు?
అలంకారాలు చందస్సులు, సంధులు
సమాసాల అద్భుత మేళవింపుల
అపురూపభాష మన అమ్మభాష!
పద్యమై హృద్యమై
వచన కవితా లతలతో
సుస్వర సంగీత రాగాలతో పాటయై
కావ్య కన్నియ యై అందాలు ఒలకబోసి
ఎన్నో కళాత్మక కళా రూపాలుగా
కళ కళ లాడే తేనెలూరించే తెలుగు భాష
దేశ భాషలయందు ఘనమైన కీర్తి గాంచిన భాష!
జీవ నాదమది మన తెలుగువారికి
స్వర నినాద అక్షర జ్ఞానంమై
బతుకు తెరువును చూపి
వెలుగు నింపిన భాష మన తెలుగు భాష!