మాధవుడు
ద్వాపరయుగాన అన్నవై
ద్రౌపది మానము కాచిన మాదవుడా
కలికాలమున బలై
బావురుమంటున్న ఆడబిడ్డల
కొసరు ప్రాణాలైనా నిలుపలేవా
ఆపద్బాంధవుడివై
యుగాలు మరువలేని
ప్రేమకథలు రాసిన రాధాలోలుడా
ప్రేమతోలు గప్పిన మృగాలు
మదమెక్క మాటేసి
కసితీరా కోసిన బేల గొంతులు కార్చే గుండె కన్నీరునైనా ఆపలేవా
ఆపద్బాంధవుడివై
తలచిన క్షణానే జతచేరి
వేనుగానముతో మైమరపించిన
గోపికారాధ్యుడా
అరచినా ఆలకించవేల
అశక్తియైన నేటి స్త్రీశక్తి
కలియుగ కీచకుల కరమున చిక్కి
ఆపద్బాంధవుడివై
Also Read : మిత్రుడు