ఎదురుచూపు
ఊహకి అందనిది జీవన యానం
ఎన్నో ఆలోచనల సమాహారం జీవిత సమరం
ఊహించుకుంటే అద్భుతమైన కలల సౌధం
వాస్తవంలో శోకతప్త జీవితం అనుభవం
ఎంత శోధించినా తెలియని జీవిత సారం
ఎన్నటికీ చిగురు తొడగని మందహాసం
అయినవాళ్లే శత్రువులుగా మారే వైనం
అడుగడుగునా వెన్నుపోట్ల పర్వం
నోట్ల చట్రంలో ఆకాంక్షలు అణిగిపోయిన ఫలితం
అలసిన కనులలో గూడు కట్టుకున్న నైరాశ్యం
ఇంకని సముద్రజలంలా నిండేను కనుల తీరం
మదిని ఆక్రమించేను తిమిర మేఘం
మడుగు లోతులకు చేరేను మధుర భావనల జీవితం
హృదిని వ్రయ్యలు చేసేను మానసిక సంఘర్షణలు క్షణం క్షణం
పుడమి తల్లి ఒడిని చేరే క్షణానికై ఎదురు చూస్తోంది వపువు అనుక్షణం
Also Read : జీవన సమరం