గెలుపోటములు
వెలుగు నీడలు కలిమిలేములు
సుఖదుఃఖాలు గెలుపోటములు
జీవన గతిలో సహజములే
సర్వులకివి సామాన్యములే
జీవితమే ఒకచదరంగం
ఎత్తులె గెలుపుకుమూలం
ఆదమరిస్తే ఓటమిఖాయం.
జీవిత మే ఒకవైకుంఠపాళి
నిచ్చెన లుంటాయి,
సర్పాలుంటాయి,
పైకెక్కిస్తాయి,కిందికి తోస్తాయి
లక్ష్యం త్వరగా చేరాలంటే
సత్సంకల్పం ఉండాలి
ఎగుళ్ళు,దిగుళ్లు ఉంటాయి,
అన్నింటిని భరిస్తూ పోవాలి..
ఆట ఆటకు నియమాలుంటాయి
నిర్దేశించిన సమయాలుంటాయి
పాటించిన వారికె గెలుపు
లేనివారికది దూరం
జీవితమే ఒక క్రీడ దేవుడె దీనికి రెఫ్రీ
ఆడించేది వాడే గెలపించేది వాడే
అనుక్షణం కనిపెడతాడు
కంటికి మాత్రం కనపడడు
ధర్మం తప్పక ఆడేవారిని
తప్పకుండ గెలిపిస్తాడు
మోసం,వంచన చేసేవారికి
ఓటమి రుచిచూపిస్తాడు.
ప్రయత్నమే అతిముఖ్యం
ఫలితం కానే కాదు,
గెలుపోటములు ఆటలొ భాగం
ఓడినవాడు గెలువకపోడు,
గెలిచినవాడూ ఓడను వచ్చు
నిరాశ నిస్పృహ తగనే తగవు
ధైర్యంతోటేగెలుచుటసాధ్యం
Also Read : చీకటి- వెలుగు