Life is a struggle : జీవన పోరాటం
జీవన పోరాటం
జీవన పోరాటం
నీ జీవితంలోకి
ఉషోదయం వస్తుందని
చేతులు కట్టుకొని కూర్చోకు
నీ బ్రతుకుల్లో
ఉషోదయం వచ్చేది
నీ చైతన్యం జాగృతిలోంచి
అని మరచిపోకు
జీవన సమరంలో ఎన్నో ఎదురుదెబ్బలు
వాటిని తట్టుకొని జీవనపోరాటం చేయాలి
జీవితం ఒక నదీ ప్రవాహం
తీరని కోర్కెల ఆరని దాహం
ఒక గట్టు సుఖ సోపానం
మరోగట్టు దుఃఖానికి స్థానం
సుఖ దుఃఖాలను ఒకటిగా చూస్తూ
ఆగకుండా సాగిపోవడమే జీవితం
Also Read : సత్ సంకల్పం