అక్షరాయుధం
కనిపించకుండా వినిపించే కవీ రంగంలోకి దిగవోయ్
కలం చేత పట్టవోయ్ కత్తిలా ఝళిపించవోయ్
అక్షరముత్యాలను ఆయుధంలా ప్రయోగించవోయ్
మూఢాచారాలను సమూల నిర్మూలానికి ప్రయత్నించవోయ్
జనులను చైతన్య పరచవోయ్
సక్రమమార్గాన నడిపించవోయ్
అణగారిన వారికి బాసటగా నిలబడవోయ్
కుల మత భేదాలను కూకటివేళ్ళతో సహా పీకేయించవోయ్
అందరిని కూడకట్టి
పెత్తందారులపై తిరుగుబాటు చేయవోయ్
నవ సమాజ నిర్మాణానికి
నడుం కట్టి కదలవోయ్
మహిళలపై దురాగతాలను
అరికట్టటానికి పాటు పడవోయ్
నీకలమపుడు కత్తవుతుందోయ్
నీ అక్షరాలపుడు ఆయుధాలవుతాయ్
Also Read : నా మాతృభాష