అక్షరం
అవినీతిపై
నాకలం గళం వినిపిస్తా
స్వేచ్ఛ కోసం
నా కలం గళం వినిపిస్తా
అణగారిపోయిన జాతి
జాగృతికోసం
నా కలం గళం వినిపిస్తా
అంతరించిపోతున్న
విలువలకోసం
నా కలం గళం వినిపిస్తా
ప్రపంచం అభివృద్ధి వైపు
పరుగులు తీసినా
ఇంకా గొంతులు
తెరవని మహిళల
అభ్యుదయం కోసం
నా కలం గళం వినిపిస్తా
సమస్యలపై యుద్ధం ప్రకటిస్తా
అక్షరాన్నే ఆయుధంగా మలచి
Also Read : కలంతో గళం