Know, O mind : తెలుసుకో ఓ మనసా

తెలుసుకో ఓ మనసా

 

తెలుసుకో ఓ మనసా

సిరి సంపదలెంతగ పెంపు జేసినా
మేడలు, మిద్దెలు అందనంత ఎత్తుకు పేర్చగలిగినా
నోట్లను కూడబెట్టినా, కోట్లకు పడగెత్తినా
మనిషిని మని‌షిగా ప్రేమించ(లే)ని నాడు
సాటి మనిషికి గట్టి మేలు తలపెట్టని నాడు
కాకిలా కలకాలం బ్రతికిన ఏమి ఫలము ఓ మనసా?

కష్ట-నష్టాలలో కొట్టుమిట్టాడే సాటివాణ్ణి చేరదీసీ
సేదదీర్చీ సాంత్వన చేకూర్చీ
ఔదార్యాన్ని చూపీ అక్కున జేర్చుకునీ
ఆపదలను తొలగించీ ఆత్మస్థయిర్యాన్ని కలిగించే
మానవుడే ‘మాధవు’డనీ
ఆపద్బాంధవుడనీ తెలుసుకో మనసా!

స్వార్ధపరత్వాన్ని చంపుకునీ
పరోపకారతత్వాన్ని పెంచుకున్న నాడే
మనిషి మహనీయుడవుతాడనీ
ఆపద్బాంధవుడనిపించుకుంటాడనీ, ఎరుగవే ఓ మనసా

 

Also Read : మాధవుడు

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!