కలం – గళం
కలం ఉవ్విళ్లూరుతోంది
గళం విప్పి నా గోడు వినిపించమంటోంది.
ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిoచమంటోoది.
మూగ నోము వీడమంటోంది.
నిజoగానే బానిసత్వం పోయిందా?
మనకు స్వాంతత్య్రం వచ్చిoదా?
కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలు
లoచం ఇస్తే గానీ, కదలని పనులు
అనాధల ఆర్తనాదాలు
పిడికెడు ముద్దకు నోచుకోని ముసలి తల్లిదండ్రులు
బడా బాబుల కబ్జా భూములు
కలుషిత ఆహారాల వింత జబ్బులు
కల్తీ ఎరువుల కలుపు మొక్కలు
బీద రోగులను వెలివేసిన పైసా వైద్యులు
ఇది కర్మ భూమి అనాలా?
లేక ఖర్మ భూమి అనాలా?
తవ్విన కొద్దీ, తరగని కధలు.
తప్పటడుగులో తప్పుడు బ్రతుకులు.
పురుటి బిడ్డ గొంతు నొక్కిన కసాయి అమ్మ
కన్న తల్లి ని కడతేర్చిన కొడుకు ప్రేమ
వృద్ధాశ్రమo లో వృద్ధుల ఒంటరి బ్రతుకులు
ప్రేమానురాగాలకై పిల్లల ఎదురు చూపులు
యువతను చిదిమేస్తున్న మాదకద్రవ్యాలు
దేశ భవిత ను కాలరాస్తున్న మారణహోమాలు
తల్లిని తాకట్టు పెట్టే రాజకీయాలు
హృదయాంతరాలను తొలిచే ఎన్నో ప్రశ్నలు
ఎవరికి చెప్పాలి? ఎలా ఆపాలి?
భారత మాత ఉహాకు అందని
ఈ విoత పరిణామాలు ఏమిటని
కలo అడగమంటోంది
గళo వినిపించమoటోoది.
కలం అడగ మంటోoది.
గళం వినిపించమoటోoది.
Also Read : నిరంతర ప్రయత్నం