అల్లల్ల నేరేడ్లు
మనిషి పుట్టిన చాలా రోజులకు భాష పుట్టింది. అప్పటి వరకు సైగలతో భావాన్ని వ్యక్తపరచే వాళ్లు. ముందుగా నిప్పు, తరువాత చక్రం కనిపెట్టే,
అటు తరువాత భాష పుట్టింది,
ఇకపోతే జానపదం అనగా, జన పదాల్లో ఉండేవారు జానపదులు. జానపదం అంటే పల్లెటూరు. జానపదులు అంటే, పల్లెటూరిలో నివసించే
ప్రజలు అని అర్థం.
ఆయా ప్రజలు నివసించే వివిధ ప్రాంతాల ఆధారంగా మాటలో తీరు మారుతుంది. దానినే మనం ఆ ప్రాంత యాసగా గుర్తిస్తాము.
తెలుగు వారి జానపద గీతాలు ఆ తెలుగు బాషకే అందం.
అలా నేను విన్న జానపద గీతాలలో అల్లల్లో నేరేడు పాటలో, శరీరానికి రక్త శుద్దిలో భాగంగా, నేరేడు పండు ఎంత అవసరమో, ఉపయోగమో… ఎవరూ లేని ఒంటరిగా ఉండే ఆ వ్యక్తికి ఆ అమ్మాయి ప్రేమ అంత అవసరం. ప్రతి ఒక్కరి జీవితానికి మరొకరు చూపించే ప్రేమను పొందాలి అని వివరణ.
అత్యద్భుతంగా ఉండే తెలుగు భాషకు మరింత సోయగం తెస్తాయి ఈ గీతాలు.
Also Read : జానపద గేయం – మోక్షం