నేస్తమా ఓ నేస్తమా
నేస్తమా
మనసు శరీరం అలసిన వేళ స్నేహ కుసుమాల
పరిమళాన్ని అందించి నూతనోత్సాహన్నిస్తావు
మధుర జ్ఞాపకాల మధువులొలికించి
పెదవులపై తీపి నవ్వులు పూయిస్తావు
చికాకులతో చిక్కుకున్న మనసును స్వాంతాన
పరచి
చల్లని చూపులతోటలో సేదతీరుస్తావు
సందేహల మబ్బులను ప్రక్కకు తోసి
సూర్యునిలా ప్రకాశించే స్థైర్యాన్ని అందిస్తావు
ఓటమి భయంతో వెనక్కి తగ్గిన వేళ
వెచ్చని స్పర్శతో వెన్నుతట్టి ప్రోత్సహిస్తావు
గెలుపుశిఖరాన నిలిచి పరవశించే వేళ
ఈ విజయం నీదే అని అందలమెక్కిస్తావు
నేస్తమా! ఒక్క మాటలో
అమ్మ, ప్రకృతి, మంచి నేస్తం భగవంతుని వరాలు
ఎన్నటికీ తరిగిపోని అమృత భాండాగారాలు
Also Read : నింగీ నేల