Immortals : చిరంజీవులు
చిరంజీవులు
చిరంజీవులు
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఒకరికి ఒకరు తోడు – నీడై కలకాలం కలసుండాలనే కాంక్షతో
కన్నవారి కలల పంటలు – పుట్టినింట మెట్టినింట కల్పవ్రుక్షాల్లా ఎదిగి
కోటి ఆశల పల్లకిలో కుచి-కుచి కూనమ్మ బాపూ గీసిన బొమ్మ
మెట్టినిల్లయిన మమతల కోవెలకు – మూడు ముడుల బంధంతో మాంగల్యం
నానుడి ఇరువర్గాల ఒప్పందంతో కలిసి జీవించాలనే సంకల్పంతో
వసుదేవ తనయుడిగా వరుడు – వంశవృక్షానికి పునాది వేసే ప్రజ్ళా స్త్రీగా వధువు
పంచభూతాల సాక్షిగా పరిణయ ప్రమాణాలకు శ్రీకారం చుట్టి
వేద పండితుల నిర్ధారణ. సుముహూర్తాన చూపులు కలసిన శుభవేళలో
ఏడు అడుగుల బంధానికి – ఆలు మగల అనురాగానికి
అనురాగ – అన్యోన్యామండ భాండాన్ని వర్షింప చేయాలనే స్థిరచిత్తంతో
కాశీ యాత్రకు సిద్దుడైన వరుడు – పూల బుట్టలో ఆసీనురాలైన వధువు
అప్పగింతలకు ఒదిగిపోయిన వదువు – కన్నీరులే తడిచి ముద్దైన సొందర్య రాశిలా
కన్యాదాత కలలపంట క్షీరసాగర మధనై – కోటి తారలకు వెలుగై..
కళ్యాణం కమనీయం జీవితం పన్నీటి పందిర్లిలో అడుగెడిన వేళ
బాజా బజంత్రాలు – ముత్యాల తలంబ్రాలతో ఏకోన్ముకులన చేస్తూ
” మాంగల్యం తంతునానేనా – మమ జీవన హేతు నా
కంటి బద్నామి సుభగే తనిం జీవ శరదాం శతం !
వేదమంత్రోచ్చారణలో నింగి నున్న దేవతల సాక్షిగా, అరుందతినే చూస్తూ
నూట ఎనిమిది నూలు పోగులు-ఏక పోగై- మాంగల్య బంధానికే వన్నె తెస్తూ
మందగమనంతో మువ్వల సవనిడితే మట్టెలను మురిపెంగ మెరిపిస్తూ
మంగళ వాయిద్యాలతో అంగుళీయముని వరునికి ధరింపజేసి
సూర్య,శుక్ర తేజసులతో సప్తపదులనే వేస్తూ శోభాయమానంగా
చంద్ర – కుజ సంచార యోగంతో – సంసార వీణను స్వగతిసూ
పంచ మాంగత్యాలతో శచీదేవిలా వధువు – లక్ష్మి నారాయణుడైన వరుడు
ఇరువర్గాలకు – ఆదర్శమై – అరమరకలు లేని “మమ జీవన వేతునా అంటూ
శ్రీ రస్తూ శుభమస్తూ- కళ్యాణమస్తుకు ప్రణామములు తెలుపుతూ
నిండు నూరేళ్లు చిరంజీవులుగా వర్ధిల్లాలి
Also Read : వేద మంత్రం