నినాదమవుతాను
నేను
దీనజనుల కన్నీటి బిందువై
రాబందుల్ని వెంటాడే ఉధృత సింధువునవుతాను
బాధిత ప్రజల పదాల అక్షరాన్నవుతాను
గాయాల గుండెల ఆలాప స్వరాన్నవుతాను
బడుగు బాధితుల కొడవలినవుతాను
న్యాయానికై ఒత్తిడి పెంచే సుత్తినవుతాను
ప్రశ్నల్ని సంధించే బాణాన్నవుతాను
చీకటితో పోరాడే అగ్నికణాన్నవుతాను
కాగడా ఊరేగింపులో నినాదాన్నవుతాను
సాధన రహదారిలో ఆశావాదాన్నవుతాను
అన్యాయాల్ని నిలదీసే గొంతునవుతాను
అసమానతల రాక్షసాన్ని అంతుచూసే
నిత్యశోధిత నేత్రమవుతాను
ఆకలి గీతాలకు గాత్రమవుతాను
కర్షకుల కనీస కోరికలకై హలాన్నవుతాను
నియంతృత్వానికి ఎదురొడ్డి నిలిచే కలాన్నవుతాను
Also Read : సమిధ