I stand in the light : వెలుగు బాటై నిలుస్తాను
వెలుగు బాటై నిలుస్తాను
వెలుగు బాటై నిలుస్తాను
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
అన్నట్లుగా ఆ ప్రేరణ తో
నేను సైతం నీతి నిజాయితీ గెలుపు బాటలో
నిప్పై నిలుస్తాను
నేను సైతం అక్రమార్కుల అణిచివేతలో
అక్రోసమై గెలుస్తాను
నేను సైతం దేశ జవానుల వీరత్వానికి
తోడై ఉంటాను
నేను సైతం భరతమాత స్వేచ్ఛ పతంగానికి
దారమై ఎగురుతాను
నేను సైతం దేశాభివృద్ధిలో
నా వంతు శ్రమను అందిస్తాను
నేను సైతం సాహితీ సాంప్రదాయాలలో
అక్షరోద్యామాన్నవుతాను
నేను సైతం నేటి యువతను
అభ్యుదయ విప్లవంలో వెలుగు బాటై నిలుపుతాను
నేను సైతం సిగ్గులేని నీచ జనానికి
కన్నెర్ర చేసే ఆయుధానవుతాను
నేను సైతం కాయకష్టం చేసే
శ్రామిక కర్షక బ్రతుకులకు ఆశ్రయానవుతాను
నేను సైతం కన్నీటి ఆర్తనాదాలకు
చెమ్మ తుడిచే చల్లని ఆసరానవుతాను
నేను సైతం ఆడపడుచులపై అఘాయిత్యాలకు
విప్లవ జ్వాలవుతాను
నేను సైతం అన్యాయాన్నీ ఎదిరించి
నిలబడి , కలబడి,తెగబడి ఎగిసే కెరటాన్నవుతాను
Also Read : నేను సైతం