ఆపద్బాంధవుడు
అక్షర జ్ఞానంకై శిష్యులకు గురువు
జీవిత జ్ఞానంకై బిడ్డలకు అమ్మా నాన్న
బతుకు సమరం లో దైవం
పాలితులకు పాలకుడు
కార్మికులకు యజమాని
కర్షకులకు ప్రకృతి ప్రభుత్వం
కుల వృతులకు వ్యాపారి
రోగులకు వైద్యుడు దవాఖాన
ఉద్యోగులకు పై అధికారి
ఓటరులకు ప్రజా ప్రతినిధి
ప్రజా ప్రతినిధులకు ఓటరు
భాషలకు బోధనా మాధ్యమం
భావనలకు మాతృ భాష
రచనలకు భావుకతా
కవి తత్వంలకు పరిశీలన
మేధోమథనం అభినందనలు
ఆపద్బాంధవుడు
Also Read : మానవత్వపు మనిషి