Good Will : సత్ సంకల్పం
సత్ సంకల్పం
సత్ సంకల్పం
ఆపదలెన్ని చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసాన్ని వీడక పోరాడాలి
జీవితమంటే నిత్య పోరాటమే
గెలుపు ఓటమిలని పట్టించుకోకుండా
అడుగడుగుకి ప్రత్యక్షమవుతున్న
సవాళ్లను జయిస్తూ ముందుకు సాగాలి
ఎప్పుడైనా
జీవిత గమనం లో ఓటమిల అంచులకి చేరినా
నిరాశ నిలువెల్లా కమ్మేసి
నిన్ను నీ ఉనికి ని ప్రశ్నార్థకం చేస్తున్నా
అదరవద్దు బెదరవద్దు
అంతులేని వేదన ల చీకట్లని పారద్రోలేలా
చిరు దీపాల వెలుగుల వంటి ప్రయత్నాల సాయంతో
బతుకుపోరు సాగించాలి
నేటి నీ చిన్ని ప్రయత్నాలే
రేపటి ఘన విజయాలు గా మారి
ఎందరికో నువ్వు ఆదర్శమై నిలిచేలా స్ఫూర్తినిస్తాయి
జీవిత సమరం వైకుంఠపాళి లాంటిదే అయినా
నువ్వు హృదయాన కలిగి ఉన్న నీ సంకల్పమే
నిన్ను ముందుకు నడిపే దిక్సూచిలా మారి
జయాలకు చిరునామా నువ్వయ్యేలా చేస్తుంది
నీ సత్ సంకల్పమే
విజేతవి నువ్వంటూ లోకానికి నిన్ను పరిచయం చేస్తుంది
Also Read : జీవనం