Garden : నందనవనం
నందనవనం
నందనవనం
తరతరాల పెద్దల అనుభవాలను అందించేలా
అనుభవ పాఠాల్ని బోధించేలా
సంప్రదాయాలను పాటింపజేసేలా
మన సంస్కృతిని నేర్పించేలా ఉండాల్సింది పెద్దరికం
కష్టసుఖాల్లో ఓదార్పునిచ్చేదిగా,
గౌరవంతో మనం అనుసరించేదిగా
క్రమశిక్షణతో పాటించేదిగా
నైతిక విలువలు తెలియజేసేదిగా ఉండాల్సింది పెద్దరికం
భయపెట్టి మాట వినేలా చేసుకోవడం
అందరి మీద పెత్తనం చెలాయించడం
తను చెప్పిందే చేయాలని శాసించడం
వయసుని బట్టి వచ్చేది పెద్దరికం కాదు
పదిమందికి అండగా నిలవాల్సింది
తప్పు చేస్తే దండించి మంచి దారిలో పెట్టేది
అందరికీ సంతోషాన్నిచ్చేలా ఉండాల్సింది
అందరి అభిప్రాయాలకు విలువనిచ్చేలా ఉండాల్సింది పెద్దరికం
కుటుంబాన్ని హరివిల్లులా రంగులమయం చేసేదిగా
కల్పవృక్షంలా కుటుంబ అవసరాలు తీర్చేదిగా
బాధల్లో ఉన్నపుడు వాటిని పోగొట్టే సంజీవనిలా పెద్దరికం ఉంటే ఆ ఇళ్ళే నందనవనం అవుతుంది
Also Read : ఆదర్శం