సఖుడు
ఆపదలో ఆదుకునే నిజమైన దేవుడు స్నేహితుడు నీడలా వెన్నంటి ఉండి కష్టాలు .
కారు మబ్బుల్లా కమ్మినపుడు
దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు .
నేనున్నాను ‘ అని అభయ హస్త్నాచ్చె
దేవుడు సోపతి సుమా
కుచేలుని పేదరికం,కష్టాలు
కలగలసి నేస్తం కృష్ణా దగ్గరకు పయనం
చిరిగిన బట్టలు తైల సంస్కారం లేని తల
రాజభటులు నీవు మా ప్రభువు స్నేహితుడివా
అని గేలి చేసి హేళన చేస్తూ ఉంటా
కుచేలుని పలుకులు విన్న పరమాత్మ
అంతఃపురం నుంచి వరివరిగా వచ్చి
కుచేలునికి సకల మర్యాదలు చేసి
తియ్యని కబుర్లు చెప్పి ప్రేమతో తినిపించి
కోరకుండానే సకలసంపదలు సౌభాగ్యలు
ప్రసాదించి ఇలాంటి సఖుడు కదా ఆపద్బాందవుడు
Also Read : జన్మ జన్మలకు మరచి పోలేను