మొదటి అడుగు
లేచిరా లేచిరా శివశంకర శూలమై లేచిరా
రఘు రాముని బాణమై కదలిరా
స్వార్థమింత విడిచిపెట్టు స్వాలంభన చేతబట్టు
దేశభవిత కరము బట్టు దేశమమత యెదనపెట్టు
ఐకమత్య మంత్రాన్ని అనునిత్యం జపించు
రక్షణనిచ్చు సైనికుడై భుక్తినిచ్చు సైరికుడై
లేచిరా లేచిరా శివశంకర శూలమై లేచిరా
రఘురాముని బాణమై కదలిరా
ఉన్మాదం మనకొద్దు జన్మాంతం తగలొద్దు
హిమోన్నత ఉన్నతాన్ని తలపాగగ వీడొద్దు
గంగయమున గోదారి ఉపకారం మరవద్ధు
అహింసకు తావులేక అహంకారమంటుకోక
స్వచ్ఛమైన ప్రవాహమై స్వరాజ్య ప్రేమికుడై
అడుగేయ్ ముందడుగేయ్ మొదటి అడుగు నువ్వెయ్
దేశమేమిచ్చందని తలచుకోకు దేశసేవ నిరతము వదలుకోకు
మనుషులందు మహారుషివై మౌనంలో వెళ్ళిపోకు
మంచివీడి మనుషులతో బంధాలు తెంచుకోకు
నీకున్న నూరేళ్ళు నిత్యకర్మ పెంచుకోకు
నిత్యపారాయణ పూజలెప్పుడు నీ హృదిలో వదులుకోకు
భక్తిలోన రక్తిలోన ముక్తిలోన నీయుక్తినింత వదలుకోకు
నీదేశ వృద్ధికెపుడు నీ అడుగులూ ముందుకేయ్
సంఘసేవ చేసినంత సామ్రాజ్యమేలినట్టే
సమాజ శ్రేయస్సులో స్వర్గసీమ దిగినట్టే
వందేళ్ళ నీ సేవకు చరితలోన ఉన్నట్టే
ఇసుమంత సేవలేక మనిషిగ నువు లేనట్టే
సమ సమాజ స్థాపనకు సమగ్రమైన అడుగేయ్
మందలోన పందికాక మహా మనిషిగా ముందడుగేయ్
Also Read : అన్వేషణ
