Favorite path : ఆశయ కోవెలకై మొదటి అడుగు వేస్తున్న
ఆశయ కోవెలకై మొదటి అడుగు వేస్తున్న
ఆశయ కోవెలకై మొదటి అడుగు వేస్తున్న
అవమానాల అంగడిలో అగ్గువ సరుకాయే బతుకు
ఆశల గమనాన అడుగడుగున అవరోధాలు
హేళనల పండగకు ఎదురొచ్చి స్వాగతం పలుకగా
చిరునవ్వు తోరణం కట్టి కఠికపు కష్టాల వాకిలిలోన
కన్నీటితో కళ్ళాపి చల్లి ఒరిమిని రంగవల్లిగా వేసి
సంకల్ప బలాన్ని ప్రమిదగా మలిచి ప్రయత్నపు పాఠాలను తైలంగా పోసి
సందేహపు దారాన్ని వడికి సందేశాల వత్తిని చేసి
తపననే అగ్గిని రగిలే జ్వాలాగా ఛీత్కారపు చీదరింపులను పారద్రోలి
బాధల చీకట్లను చీల్చివేసి కళ’ల దారికై జ్యోతిని వెలిగించి
నలుదిక్కుల్లోన నలుపు నన్ను చూసి నవ్వుతూ
పకపక పరిహాసపు పరాచకాలాటలోన
ఆశయపు కోవెలను చేరేందుకై కాలమే నేస్తమై తోడుండగా
నచ్చిన బాటలోన నవ్వులకై నడకను మొదలెట్టి
అణువణువునా ఆత్మావిశ్వాసం నింపుకొని మొదటి అడుగు వేస్తున్న
Also Read : ఎటువైపు