ఆపద్భాంధవుడు
తెగులు బట్టిన తెలుగు భాషకు తీరునెప్పుడు ఆపదా
బోధనాంగ్లము జొచ్చె నకటా పాఠశాలల విద్యలందున
పాతిపెట్టిరి మాతృభాషను పరవశించిరి ఏలనో
పరదేశీ మోజులందుచు బ్రతుకు మార్గము మరిచిరీ
ఎంత మందికి కలిసి వచ్చును సావకాశపు సంపదల్
పేద బ్రతుకుల కాంగ్లమేవిధి పరవశమ్ముల నిచ్చునో
సనాతనపు సంస్కృతిట్టుల సుంతయైనను కానరాదో
ఎంతో దూరము లేదు లేదిక మరుగు బడగను మాతృభాషా
ఆదుకొనెడు ఆపద్భాంధవుడెచట నుండెనొ కాలమా
తెలియజెప్పుము తేలికౌ మనసెంతయో
మధురానుభూతిని పొందుగా
Also Read : క్రొంగొత్త సృష్టి