Eldership : పెద్దరికం
పెద్దరికం
పెద్దరికం
బుద్ధి బలం నిండుగా
మేధస్సు అనంతంగా
ఓర్పుకు ధరణిగా
సహనం అపరిమితంగా
ఆత్మవిశ్వాసం అంబరమంతగా
వ్యసనాలకు దూరంగా
గుణగణాలకు నిలువెత్తు ప్రతీకగా
యువతకు ఆదర్శప్రాయుడిగా
సృజనాత్మకతకు నిదర్శనంగా
ఒత్తిడిలోనూ సమర్ధంగా నడిపించే నాయకుడిగా
మాటలతో ప్రేరణ కలిగించే మాంత్రికుడిగా
ఆపత్కాలంలో ఆదుకునే ఆపద్భాంధవుడిగా
యువతకు సరైన దారిచూపే దార్శినికుడిగా
జీవన నౌకను గమ్యానికి చేర్చే దిక్సూచిగా
నిలిచేను పెద్దరికం, అంబరాన్ని అంటే గౌరవం
వెలకట్టలేని తరతరాల చరితం
Also Read : నాటకమే