ప్రయత్నం
కాలమాడే ఆటలో పావులమే
జీవనగమనంలో బాటసారులమే
ఎంత తెలుసుకున్నా తెలిసింది అణువే
తెలుసుకోవలసింది సింధువే
కోరికల పర్వంలో కోతల గాంభీర్యంలో
నిత్యజీవన సంఘర్షణలో యోధుడిగా సాగడమే
మనిషిగా పయనించడమే
ఆలోచనలు అవధులు దాటినా
ఆవేశం కట్టలు తెగినా
అసమర్థత తొంగిచూసినా
అవమానం ఎదురైనా
ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయడమే
మమజీవన హేతునాయని ముందుకు సాగడమే
Also Read : మరపురాని మధుర చెలిమి