Drama : నాటకమే
నాటకమే
నాటకమే
చీమకైనా దోమకైనా పశువుకైనా పక్షికైనా
సృష్టిలో ఏ జీవికైనా నిరంతర పోరాటం తప్పదు
బరువైనా భాధ్యతలు మోయక తప్పదు
సమాజంలో మనిషిగా స్థానం కోసం
ఆందోళన ఆవేదన నిత్యసమస్యల సంఘర్షణ
నీలో నాలో ప్రతిజీవిలో చైతన్యానికి ప్రేరణ
ప్రతికోణంలో చివరికి మిగిలేది
బతకడం తప్పదనే భావన
ఎన్ని సంఘటనలు జరిగినా
ఎన్నిసన్నివేశాలు జీవితాన్ని మలుపుతిప్పినా
సంతోషం విచారం దు:ఖం ఆశ్చర్యం
ఊహలు కోరికలు ఆశలు ప్రేమలు
ఆసూయ స్వార్థం ద్వేషం అహం
ప్రవర్తనలో మాటలో చేతలలో కనిపించే నైజం
వ్యక్తిత్వం గుణం మనస్తత్వం
ఎన్ని రకాలుగా అంచనా వేసినా
ఎన్ని విధాలుగా పరిశీలించినా
ఎవరిజీవితం వారికి యుద్ధమే
పుట్టుక చావులమధ్య నాటకమే
Also Read : జీవన పోరాటం