Divinity : దివ్యత్వము
దివ్యత్వము
దివ్యత్వము
వయస్సుతో పాటు వచ్చేదే పెద్దరికం
పిల్లపాపల్ని ఆదరించే
సుగుణం పెద్దరికం
అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఖండించి
నిర్భయంగా న్యాయాన్ని ప్రకటించే
ధీరత్వమే పెద్దరికం
చిన్నపిల్లలు తెలియక ఆకతాయితనంగా ప్రవర్తిస్తుంటే
విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఎలా ఎదగాలో తెలియజేసే
గురుతత్వం పెద్దరికం
యువత పెడదోవ పట్టినప్పుడు
మందలించి సన్మార్గాన్ని ప్రబోధించే దివ్యత్వమే పెద్దరికం
సమాజానికి సైతం దిక్సూచిలా పనిచేసే
పెద్దవారి వాగ్భూషణం సదా అభినందనీయం
అనుసరణీయం
Also Read : నందనవనం