అక్షరమా
కాగితం మీదకి అక్షరాలోచ్చాకే
ఆ కాగితంకి విలువచ్చే అక్షరమా
అర్థవంతమైన అక్షరాలను లిఖిస్తూ
పదాలకే అలంకరణ తేస్తు ఆకట్టుకోగా
ఆణిముత్యాలాంటి పదకూర్పుకి
కారణమవుతున్న అక్షరమా
మనిషి ఎదుర్కొనే సమస్యలను
అక్షర రూపంలో వెలిబుచ్చే సాధనమా
అక్షరాలను పోగేస్తూ కథా శిల్పి
అక్షరపు కోటలు కట్టి అంకురార్పణ చేయగా
కొలువుల కోసం, లోక విచక్షణ కోసం
సమరంలా పోరాడే అక్షరమా
రాసే వారు కలుషితం కావచ్చేమో
కానీ అక్షరం కలుషితం కాదు
పుస్తకానికే వన్నె తెచ్చిన
ఓ అక్షరమా ఓ ఆయుధమా
Also Read : అక్షరం ఒక సృష్టి