Darkness – light : చీకటి- వెలుగు
చీకటి- వెలుగు
చీకటి- వెలుగు
నిన్న నీతో ఉన్న గెలుపు
నీ వద్ద నుండి జారిపోవచ్చు
నీ గూటికి ఓటమనే పక్షి వచ్చి
సేద తీరవచ్చు
గెలుపోటములు జీవితంలో సహజం
ఏదీ శాశ్వతం కాదని గుర్తుంచుకో
చీకటి తర్వాత వెలుగు
ఓటమి తర్వాత గెలుపు సహజమని మరిచిపోకు
గెలిచానని పొంగుపోకు
విజ్ఞతను మరచి
అహంకారిగా మారకు
కొన్నాళ్ళకు నీ విజయం
కాలగర్భంలో కలసిపోతుంది
నిన్ను మరచిపోతుంది
ఓటమి వచ్చిందని కృంగిపోకు
నీ బలాలను ఏకంచేసి
బలహీనతలను అధిగమించు
ఆత్మవిశ్వాసాన్ని వదలక
ప్రయత్నం చేయి
గెలుపు వాలుతుంది నీ ముందర
రెక్కలు కట్టుకుని
Also Read : గెలుపోటములు