నిరంతర ప్రయత్నం
నిరాశ నీలి మేఘమై
కమ్మిన వేళ గెలుపోటములు ఒక్కటేననిపించినా
ఆశ శ్వాసగా సాగుతున్న వేళ ఓటమి కృంగదీసినా
ఓటమంటే నాకిష్టం
ఓడిపోయిన ప్రతిసారి
ఓ కొత్త గుణపాఠం నేర్పుతుంది
గెలవాలన్నతపన రెండింతలవుతుంది
అనుభవాన్ని మించిన పాఠం ఏం ఉంటుంది జీవితంలో
ఓటమి ఓర్పునేర్పితే
గెలుపు ఓదార్పవుతుంది
గెలుపు ఆనందం కలిగిస్తే
ఓటమి ఆలోచన రగిలించి లక్ష్యసాధనకై
ఉరకలు వేయిస్తుంది
అపజయమెప్పటికైనా
విజయానికి తొలిమెట్టే
ఓటమి అంగీకారమైతే
స్తబ్ధతదే రాజ్యాధికారం
గెలుపుకై ఆరాటం
ఓటమిపై పోరాటం
నిరంతర చైతన్యశీల మేథోవికాసం
సునాయాస గెలుపు కన్నా
అనాయాస ఓటమి మిన్న
ఓటమిని ఓప్పుకోక
పోవడమే నిజమైన గెలుపు
Also Read : ఓటమి గెలుపుకు నాంది