అఖండ భారతం
కేదార దారల
లవంగం పూతల నా మాతృభూమి
భారత భాగ్య విధాత
నదీ నదాల ఎగసే జలతరంగం
పంట పుష్కలాల లాల
నిజాల ఖనిజాల
ఆధ్యాత్మిక గనుల సొరంగం
ఇది సాఫల్య పునీత
అంగాంగం వేద వేదాంగాలు
నింపుకుని సిరులు ఒసగే
అఖండ అనంగం
నా తల్లి ఒడిలో
పుడుతూనే శిశువులు అనాధలు
వారి ధన అంతస్తును బట్టి
ఎదిగే మానవ మానులిపుడు
విలువలు రాలుపూలు
Also Read : మాతృభూమి