వెయ్యి తొలి అడుగు
సంగ్రామమైన, సంరంభమైన
రెండింటిని స్వీకరిస్తూ
ధైర్యంగా పోరాడుతూ
వెయ్యి తొలి అడుగు
జీవితాన్ని మార్చుకుంటూ
సవాళ్ళను ఎదుర్కుంటూ
ముందుచూపుతో ఆలోచిస్తూ
వెయ్యి తొలి అడుగు
బరువునైనా, భాద్యతనైనా
చిరునవ్వుతో స్వాగతిస్తూ
నవ్వే నీ ఆయుధంగా
వెయ్యి తొలి అడుగు
కల నిజమైనా కాకున్నా
అలుపెరుగక శ్రమిస్తూ
దారి సుగమం చేసుకుంటూ
వెయ్యి తొలి అడుగు
అందరూ మన వాళ్ళ అంటూ
అందరిని కలుపుకుంటూ
అందరి మంచి కోరుకుంటూ
వెయ్యి తొలి అడుగు
కష్టాలు, కడగండ్లు
అనే మాటలు మూలకునెట్టి
ఆత్మవిశ్వాసం నీలో నింపి
వెయ్యి తొలి అడుగు
ఆనందం నా సొంతం అని
ప్రతిక్షణం ఆస్వాదిస్తూ
సంతోషపు లోగిలిలోకి
వెయ్యి తొలి అడుగు
మనసుతో మహిని చూస్తూ
ప్రకృతిని ప్రేమిస్తూ
మనస్ఫూర్తిగా అనుభవిస్తూ
వెయ్యి తొలి అడుగు
జ్వలించే కోరిక నీదైతే
శ్రమించే శక్తివి నీవైతే
మొదటి అడుగుకు ధైర్యం తోడైతే
ప్రయత్నంలో లోటు లేకుంటే
విజయం నిన్ను వెతుకుతూ వస్తుంది
నిన్నే విజేతను చేస్తుంది
Also Read : మొదటి అడుగు