Believe In Hard Work : కృషిని నమ్ముకో
కృషిని నమ్ముకో
కృషిని నమ్ముకో
బలహీనులు అంటే మరెవరో కాదో
అదృష్టాన్ని నమ్ముకునే వారే
కృషిని నమ్ముకుని ముందడుగు వేసే వారే
నిజమైన శ్రామికులు
అనుకున్నది సాధించే ధీరులు మరి జీవితములో
మనం బలహీనులమా
బలవంతులమా ఎలా బ్రతుకు తామే మనమే నిర్ణయించేది
ఎవరు వచ్చినా ఏమీ చేయరు
ఎదలో నీ బాధను చూడరు
నిత్య శ్రామికుడువై పయనించు
నీకంటూ ఒక రోజు వచ్చు
శత్రువులనే అద్దం చూడు
తప్పులను సవరించి
రాయిని శిలగా మొలచినట్లు
నిన్ను నువ్వు మలుచుకో
సాధనకు పని దాసోహం
మనిషి చేయాలి సాహసం
మునుగుతే ముత్యాలు
లేదంటే అనుభవాలు
నాట్యం చెయ్యాలంటే
కాళ్లకు గాయం తప్పదు
ఓర్చుకుని చేసావంటే
అద్భుతం నృత్యం ఆడి నట్లే
కృషితోనే అందరికీ విజయాలు
అదృష్టాలు కొందరికే స్వేదం లోనే గౌరవం
శాశ్వతమై వెంట నిలుస్తుంది
Also Read : స్వయం కృషి