Basis : ఆధారం
ఆధారం
ఆధారం
మా జీవనానికి ఆధారమైన ఓ స్త్రీ నీకు వందనం
నీ వల్లే సర్వ సుఖాలు మాకు దక్కుతున్నాయి
పురుషుడు కేవలం ద్రవ్యాన్ని మాత్రమే సంపాదిస్తాడు
ఇంటికీ తెచ్చిన ద్రవ్యాలను
నీ నేర్పరి తనం వల్ల మాకు రుచి కరమైన ఆహారంగా అందిస్తున్నావు
నీవు ఎక్కడో పుట్టి కేవలం తాళి బంధం తో ఇంటి పేరును
నీ ఇష్టాలను మార్చు కొని మాతో కలిసి జీవిస్తావు
నీ కంఠానికి తాళి బొట్టు
ఉన్నంత వరకూ నీకు
సర్వ సుఖాలలో పాటుగా
గౌరవ మర్యాదలు విలువలు దక్కుతాయి
కుటుంబ ప్రతిష్ఠ
సంతాన ప్రాప్తి కలుగుతుంది
నీ మెడలో తాళి బంధం తెగనంత వరకే
నాకు నీవు లేక పోయిన
నేను నీకు లేక పోయిన
ఇద్దరి మిగిలిన జీవితాలు నిస్సరమే
పురాణ హితిహసల్లో స్త్రీ తన భర్తకు సకల సేవలు అందించే గుణవతిగా సౌశిల్య రాలుగా
పతి వ్రతగా కీర్తీ ప్రతిష్టతలు పొందింది
తన భర్త ప్రాణాలు కోసం సావిత్రి యముడినే నిలదీసింది
సీతా రావణుడిని నిలువరించి oది
సత్యభామ తన భర్త కృష్ణుడి విల్లు తీసుకుని పోరాడింది
తన భర్త కట్టిన మాంగల్యంతో
అతడు గుణవంతుడైన గుణ హినుడైన సంపాదన పరుడు కాకున్నా గుడిసె అయిన మేడలో నైనా అతని చల్లని పాలనలో ఉండేది
ఏ బంధము లేని తాళి బంధం తో కలసి మెలసి ఉండేది
స్త్రీ లేనిదే సృష్టి లేదు
Also Read : సౌభాగ్యమైన జీవితం