Another morning : జీవన సమరం
జీవన సమరం
జీవన సమరం
రణమందు పోరాడే సైనికుడిలా నేను
సమరం లో ఉవ్వెతున్న ఎగిరే అగ్ని కణం లా నేను
మనసున ఎగిసి పడే కల్లోల సమస్యలతో
పోటా పోటీగా పడుతూ లేస్తూ పరిగెడుతూ నేను
ధరలు ఆకాశాన్ని అంటుతున్నా
ద్రవ్యోల్బణం నిట్టనిలువునా ముంచేస్తున్నా
సొంత ఇల్లు కట్టలేక అద్దింట్లో ఇమడలేక
బంధువులొస్తే ఎప్పుడెళతారా అని ఎదురుచూస్తూ
ఓ దరిద్రపు బతుకు బండిని లాగే
ఓ సగటు మనిషి,ఓ మధ్య తరగతి మనిషి
ఆవేదనా పరిస్థితి అర్ధం చేసుకునేదె వ్వరు?
ఈ కట్టె ఎప్పుడు తెల్లరుతుందా అని అనుకుంటూ
మళ్లీ మళ్లీ అవే సమస్యలు
పాతకాలపు వాసనలు వెదజల్లుతూ
నా చుట్టూ అలముకుంటుంటే
ఈ జీవన సమరంలో మరో ఉదయం చుట్టుముట్టింది
Also Read : ఆపద్బాంధవుడు