అన్నీ అక్షరమై
అమ్మలా లాలిస్తూ
నాన్నలా ధైర్యమిస్తూ
స్నేహితుడిలా నీతో సావాసం చేస్తూ
గురువులా హితం భోదిస్తూ
ప్రేయసిలా కమ్మని కబుర్లు చెబుతూ
భార్యలా జీవితాన్ని చక్కపరుస్తూ
బిడ్డల్లా ఆనందాలను రెట్టింపు చేస్తూ
తప్పు చేస్తే హెచ్చరిస్తూ
మంచి చేస్తే ప్రోత్సాహం అందిస్తూ
కొన్నిసార్లు నవ్విస్తూ
కళ్ళను చమర్చేటట్లు చేస్తూ
మంచి మార్గాన్ని చూపిస్తూ
ఒంటరైనప్పుడు తోడుగా ఉంటూ
భవిష్యత్తుకు చక్కని మార్గం చూపిస్తూనే
అక్షరం ఆయుధమై
అవినీతి ,అన్యాయాల పై
ఎదురుతిరిగి పోరాటం చేస్తోంది
న్యాయం కోసం ఎన్నేళ్లయినా
Also Read : విద్య