క్రొంగొత్త సృష్టి
చెలిమి చరవాణి చలవతో
మనిషి బందీ కలికాల మహిమే
ఆధునికతలో క్రొంగొత్త సృష్టి
మది తలపు తట్టే దైవమిచ్చే వరంలా
ఆపత్కాలాన క్షణంలో కార్యసిద్ధి ప్రాప్తి
తలచినదే తడవు జరిగే మాయాజాలం
పిలిచినదే దూరాభారాల్ని కాలదన్ని
కళ్లముందే సాక్షాత్కారమై
అలరించే సౌలభ్యమే క్షణక్షణానికి
సరికొత్త సృజనతో ఆకర్షించేది
సాంకేతిక పరిజ్ఞాన మాయా పేటికలో
మన భవితవ్యం గీతోపదేశమై
ఉపాధికల్పనకు రాదారి కాగా
యువతరపు ఆలోచనలకు దిక్సూచి గా
మమకారాలకు వక్రమార్గమైనా
నేటి యుగానికదే ఆపద్భాంధవుడై
Also Read : దైవం