మానవత్వపు మనిషి
సాఫీగా కాలం సాగిపోయేటప్పుడు తెలియదు
ఏ క్షణం ఏ ఆపద ముంచుకు వస్తుందో
అందరూ ఉన్నా అనుకోని కష్టం తలుపుతడితే
ఎవరి ఆధారమూ దొరకని క్లిష్ట పరిస్థితులలో
ముందుకు వచ్చి మనకు తోడుగా నిలిచే
ఒక మానవత్వపు మాణిక్యమే ఆపద్బాంధవుడు
ఏ రక్తసంబంధమూ లేని మహాత్ముడతడు
పరోపకారమే పరమావధిగా చరించే వ్యక్తి అతడు
అటువంటి ఆపద్బాంధవుడిని ఆకాశానికి ఎత్తడం కాదు
మనం కూడ అతనిలా మారి మరొకరికి అండగా నిలవాలి
ఆపద వచ్చినపుడు నిస్వార్థంగా ఆదుకోవాలి
మానవత్వపు విలువలను పెంచుకుని
దేవుడనే వాడు ఎక్కడో లేడు మనుషుల మధ్యేనని
లోకానికి తెలిసేలా ప్రవర్తించాలి అదే ఆపద్బాంధవం
అదే మనిషికి, మనిషికి మధ్య ఉండవలసిన నిజమైన బంధం
Also Read : రక్షకుడు