A little story : కొసమెరుపు కథ

కొసమెరుపు కథ

 

కారణ జన్మ

రాత్రి నుండి నారాయణకు కంటి మీద కునుకు లేదు. భార్య ఉండి తను చనిపోయినా బాగుండేది. తను అందరికీ పనికి వచ్చేది. తను మగవాడైనా ఏ పనికీ చేత కాని వాడయ్యాడు. నలుగురు కోడళ్ళలో నాల్గవ కోడలి దగ్గరే ఎందుకుంటావు,ఆస్తి నలుగురికీ సమానంగా పంచినప్పుడు నలుగురి దగ్గరకూ వెళ్లి ఉండవచ్చు కదా అంటారు అందరూ.

తన గుండె బాధ ఎవరికి చెప్పుకోవాలి. గుండెల మీద పెట్టుకుని నలుగురినీ అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు . పెద్ద వాళ్ళయ్యారు పెళ్లిళ్ళు చేశారు.భార్య అనారోగ్యం తో చనిపోయింది.పిల్లలు ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్నా ఇద్దరూ హాయిగా ఉన్నారు. స్వంత ఇంట్లోనే ఏ ఒక్క పనీ చేయించేది కాదు భార్య. ఎంతో అపురూపంగా చూసుకునేది .

ఏదైనా సాయం చేద్దామంటే “ఆఫీసులో పని ఇంట్లో కూడానా మీకు పని ” అని గారాబం గా కసురుకునేది.టిఫిన్, కాఫీ , భోజనం ,తను వేసుకునే మందులు అన్నీ సమయానికి అందించేది. తను చనిపోయాక తెలిసింది, తను అందరూ ఉన్నా అనాధ (A little story ) అయ్యానని.

ఎంత పెద్ద ఆఫీసరైనా భార్య ముందు చిన్న పిల్లాడిలా ఏది పెడితే అది తినటం, డాక్టర్ చెప్పిన మందులు భార్య ఏ పూట దాపూట ఇస్తుంటే వేసుకోవడం అలవాటు. అందమైన భార్య , హాయి అయిన జీవితం, ఈ జీవితానికి ఇంకేం కావాలి. ఇలా సాగిపోతే చాలనుకున్నాడు. కానీ భవిష్యత్తు ఆలోచించలేదు.

మొదటి సారి జీవితం అంటే భయం కలిగింది. భార్యా భర్తలు తోడూ నీడలు అంటారు కదా మరి ఇద్దరినీ విడదీయకుండా తీసుకెళ్ళి పోతే ఎంత బాగుంటుంది ఆ దేవుడు (A little story ) అనుకున్నాడు నారాయణ.

పిల్లలు అందరూ అన్నట్లే ఒక్కరే ఎందుకు లంకంత ఇంట్లో మీరేమీ చేసుకుంటారు నలుగురం ఉన్నాం మూడేసి నెలలు ఉండి వెళుతుండండి అన్నారు. కానీ వాళ్ళు చెప్పినంత తేలికగా లేదు నారాయణకు.

పెద్దోడింటికి వెళ్ళినప్పుడు పెన్షన్ కు ఆఫీస్ కు వెళ్ళి తీసుకోవడం బాగా దూరమైంది. అదీ కాక భార్య ఉన్నన్ని రోజులు కుర్రాడిలా యాక్టివ్ గా ఉండేవాడు. భార్య చనిపోయాక ఉన్న వయసు కంటే పదేళ్ళు ఎక్కువగా ఉన్నట్లై ఏ పని మీద ఆసక్తి లేకుండా పోయింది.

అందులో కోడళ్ళు “మందులు కూడా వేసుకోకుండా బాగానే గారాబం చేసిపోయింది అత్తగారు ” అని అనుకోవడం తన చెవి దాటి పోలేదు.

రెండవ వాడు చాలా బిజీగా ఉంటాడు. మందుల షాపు బాగా దూరం. వెహికిల్స్ దొరకవు.కారు అబ్బాయి వేసుకెళతాడు. వాడు వచ్చేసరికి అర్ధ రాత్రి అవుతుంది. ఆదివారం సెలవు,మందులు ఒకోసారి ఆలస్యం అయితే ఇబ్బంది పడుతున్నాడు.

మూడవ వాడి ఇంట్లో అతని అత్త గారు మావగారు ఉంటారు. వాళ్ళ తో తను ఉండలేడు.ఆ మూడు నెలలు చాలా ఇబ్బందిగా గడుస్తాయి.
ఇకపోతే నాల్గవ వాడు వాడి ఇంటికి అన్నీ దగ్గర గా ఉంటాయి చాలా సదుపాయంగా కూడా ఉంటుంది. మనసుకు కాస్త ఆనందంగా కూడా ఉంటుంది. కోడలు మిగతా అందరి కోడళ్ళ (A little story ) మీద నయం విసుక్కోకుండా అందిస్తుంది.

ఓ అమ్మలా అనిపించింది. అందుకే ఇంక ఇక్కడే ఉండి పోయాడు.కానీ నిన్న కోడలు అమ్మ వచ్చింది. ” అడ్డమైన గొడ్డు చాకిరీ చేయడానికి నువ్వేమైనా తేరగా ఉన్నావా ఇక్కడ, నువ్వొక్క దానివే కాదు కదా కోడలు మిగతా ముగ్గురు హాయిగా ఉంటే నువ్వు ఇద్దరు పిల్లలతో అతనికి చేయాల్సిన పనేంటి అంటోంది గట్టిగా “.

“ఊర్కో అమ్మా ఆయన వింటే బాధ పడతారు అంది కోడలు.” అన్నీ మాటలు తన చెవిన బడ్డాయి. చూసేవాళ్ళు ఉన్నా ఓర్చుకోని వాళ్ళు కూడా ఉంటారని మొదటి సారి అర్థం అయింది అతనికి. మళ్ళీ భార్య గుర్తు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.” రాజ్యం నీతో పాటు నన్నెందుకు తీసుకెళ్ళ లేదని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.

ఎప్పటికో కునుకు పట్టిన నారాయణకు కోడలి ఏడ్పు , కోడలి అమ్మ అరుపులు విని ఉలిక్కి పడి లేచి పరుగెత్తుకుని వచ్చాడు. చిన్న మనవడు క్రింద రక్తపు మడుగు లో ఉన్నాడు. “ఏమైందమ్మా అన్నాడు కంగారుగా .” “మామయ్య బన్నీ మంచం మీద నుంచి జారి పడిపోయాడు.తలకు దెబ్బ తగిలి రక్తం విపరీతంగా కారుతోంది మామయ్యా” అంటూ ఏడ్చేస్తుంటే.

“ఊరుకోమ్మా ఏమీ కాదు అంటూనే డ్రైవర్ కు ఫోన్ చేస్తాను .త్వరగా హాస్పిటల్ తీసుకెళదాం” అంటూనే డ్రైవర్ కు ఫోన్ చేశాడు. ఐదు నిమిషాల్లో డ్రైవర్ వచ్చాడు.ఈ లోపు తలకు గట్టిగా కట్టు కట్టాడు నారాయణ. వెంటనే దగ్గర లోని హాస్పిటల్ కు తీసుకెళ్ళారు .

డాక్టర్లు బాబును పరీక్ష చేసి తలకు గట్టిగా దెబ్బ తగిలింది 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేమన్నారు. కోడలుకు ధైర్యం చెప్పి , డాక్టర్లకు కావలసిన మందులు బిల్లు అన్నీ కట్టి అక్కడే ఇంకా ఏమైనా కావాలేమోనని పచార్లు చేస్తున్న మామగారిలో మొదటి సారి తండ్రిని చూసింది.

భర్త ఆఫీస్ పనిమీద ముంబాయి వెళ్ళడంతో సాయంగా ఉంటుందని తల్లిని పిలిపించుకుంది. తండ్రి చనిపోయాక తమ్ముడు దగ్గర ఉంటోంది అమ్మ. పెద్ద కోడలి తో పడదని చిన్న కోడలు దగ్గర ఉంటూ మామయ్య గారిని ఎన్ని మాటలు అంది అని బాధ పడింది.

ఆ మరునాడు డాక్టర్లు ” గండం గడిచిందమ్మా , సమయానికి బాబును తీసుకుని రాబట్టి ప్రాణ గండం తప్పింది ” అనగానే నారాయణ కు రెండు చేతులు జోడించింది కన్నీళ్ళతో. ” మీరు లేకపోతే ఈ రోజు బన్నీ నాకు దక్కేవాడు కాదు మామయ్యా అంది ఏడుస్తూ “.

కోడలు తల్లి పరిస్థితి చాలా దయనీయంగా అనిపించింది నారాయణకు ” మీ సాయం మరువలేము అన్నయ్య గారు అంతా  అర్ధ రాత్రి అల్లుడు కూడా లేడు. మీరుండబట్టి సరిపోయింది” అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ మనసులోనే మన్నించమని ఆ దేవుని (A little story ) మనసారా కోరుకుంది.

క్షేమంగా బన్నీ తో ఇంటికి వచ్చాక భార్య ఫోటో తీసుకుని “జీవితానికో అర్థం దొరికింది రాజ్యం , ఆ దేవుడు ఇద్దరినీ ఒకేసారి ఎందుకు తీసుకెళ్ళ లేదో తెలిసింది , పిల్లలు మనల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అంతే చాలని ” ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు పొంగి వస్తున్న కన్నీళ్ళు భార్య చూడగూడదని ప్రతి జన్మకో (A little story ) అర్థం ఉంటుందని అనుకుంటూ.

 

Also Read : గెలుపోటములు 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!