అక్షరమే ఒక ఆయుధం
అజ్ఞాన తిమిరాలను తరిమివేసి
విజ్ఞాన జ్యోతులు వెలిగించే
ప్రతిభా శాలి ఈ అక్షరం
మానవుడిని ప్రగతి పథంలో
నడపాలి అన్నా, అక్రమాలు
అన్యాయాలు పై పోరాడాలి అన్నా
వెన్నెముక ఈ అక్షరమే
పౌరులను సంస్కారవంతంగా
తీర్చిదిద్దే ఆలంబన అక్షరం
మనిషి మనుగడను
ప్రభావితం చేసే ఈ అక్షరం
సమాజానికి అత్యవసరం అయిన
శక్తివంతం అయిన ఆయుధం.
Also Read : అక్షరమే ఆయుధం